టాలీవుడ్ ని వెంటాడుతోన్న కొత్త భ‌యం!

సినిమా రిలీజ్ కు ఎన్ని సీజ‌న్లు ఉన్నా? స్టార్ హీరోలంతా సంక్రాంతి సీజ‌న్ టాప్ గా భావిస్తుంటారు.;

Update: 2026-02-19 12:24 GMT

సినిమా రిలీజ్ కు ఎన్ని సీజ‌న్లు ఉన్నా? స్టార్ హీరోలంతా సంక్రాంతి సీజ‌న్ టాప్ గా భావిస్తుంటారు. ఆ సీజ‌న్ లో నే త‌మ సినిమాల్ని రిలీజ్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. ఈ విష‌యంలో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు అంతే మ‌ద్ద‌తుగా నిలుస్తారు. హిట్ అయితే భారీ లాభాలు వ‌స్తాయ‌నే ఆశ‌తో సంక్రాంతి సీజ‌న్ మిస్ అవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

దీంతో మిగ‌తా సీజ‌న్ల‌లో స‌రైన రిలీజ్ లు ఉడటం లేదు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. హీరోలు సంక్రాంతి సీజ‌న్ కే క‌ట్టుబ‌డి ఉండ‌టంలో ఎంత మాత్రం త‌ప్పు లేదు. మ‌రి ప్రేక్ష‌కులు కూడా సంక్రాంతి సీజ‌న్ కే క‌ట్టుబ‌డితే ప‌రిస్థితి ? ఏంటి అన్న‌దే ఆందోళ‌న క‌రంగా మారింది.

సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల‌న్నీయావ‌రేజ్ గా ఉన్నా ఆడేస్తున్నాయి. మంచి లాభాలు తెచ్చి పెడుతున్నాయి. థియేట్రిక‌ల్ గా వంద‌ల కోట్లు వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాయి. దీనంత‌టికీ కార‌ణం ప్రేక్ష‌కులు. ఆ సీజ‌న్లో జ‌నాలు థియేట‌ర్ల‌కు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. వారం రోజులు సెల‌వులు..కుటుంబాల‌న్నీ ఒకే చోట‌కు చేర‌డంతో? ఎంట‌ర్ టైన్ మెంట్ పేరుతో థియేట‌ర్ కు వ‌చ్చి సినిమా చూసెళ్తున్నారు. ఇది కేవ‌లం టైంపాస్ గానే క‌నిపిస్తోంది. ఈ సంక్రాంతి త‌ర్వాత దాదాపు 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో విజ‌యం సాధించిన చిత్రాలేవైనా ఉన్నాయా? అంటే ఒక్క‌టి కూడా క‌నిపించ‌లేదు.

సంక్రాంతి త‌ర్వాత థియేట‌ర్ల వ‌ద్ద ఎంత మాత్రం జనాల‌తో క‌ళ‌క‌ళ‌లాడ‌లేదు అన్న‌ది వాస్త‌వం. అంటే ప్రేక్ష‌కులు సంక్రాంతి సీజ‌న్ కు ఎంత ప్రాధాన్య‌త ఇస్తున్నారు? అన్న‌ది అద్దం ప‌డుతుంది. కానీ ఈ విధానాన్ని మార్చాల్సింది కేవ‌లం సినిమా వాళ్లు మాత్ర‌మే. ఇలా ఒకే సీజ‌న్ కు ప్రేక్ష‌కులు ఫిక్సై అయితే మిగ‌తా సీజ‌న్ల‌లో మంచి సినిమాలు రిలీజ్ అయినా అవి జ‌నాల‌కు రీచ్ అవ్వ‌డం క‌ష్టం అవుతుంది. ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లో నుంచి దీన్ని తొల‌గిం చాలంటే బ‌ల‌మైన కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలి. తొలి షో అనంత‌రం మౌత్ టాక్ తోనే సినిమా జ‌నాల్లోకి బ‌లంగా వెళ్లిపోవాలి.

ఈ విష‌యంలో తెలుగు సినిమాల కంటే ప‌ర భాష‌ల సినిమాలు స‌క్సెస్ అవుతున్నాయి. రెండేళ్ల కాలంగా మాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతోన్న కంటెంట్ బేస్డ్ చిత్రాలు తెలుగు మార్కెట్ లో ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తున్నాయో తెలిసిందే. ఆ మ‌ధ్య రిలీజ్ అయిన తెలుగు సినిమాలు కొన్ని మంచి ఫ‌లితాలు సాధించాయి. కంటెంట్ తోనే జ‌నాల్ని థియేట‌ర్ కు ర‌ప్పించాయి. కానీ ఏడాదిన్న‌ర కాలంగా టాలీవుడ్ మ‌ళ్లీ ఆతర‌హా సినిమాల విష‌యంలో వెనుక‌బ‌డుతోంది. ఇదే కొన‌సాగితే? ప్రేక్ష‌కులు సంక్రాంతి సీజ‌న్ కే స్టిక్ అవుతారు. చిన్న సినిమాలు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత దూర‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది.

Tags:    

Similar News