టాప్ స్టోరి: నాన్న కూచీలకు భలే టైమ్ పాస్!
లాక్ డౌన్ ఒక్కొక్కరికి ఒక్కోలా కలిసొస్తోంది. ముఖ్యంగా నాన్న కూచీలకు భలే టైమ్ పాస్ అవుతోంది. డాడీతో ఆటలాడుకోవడానికి కావాల్సినంత టైమ్ దొరికింది. లాక్ డౌన్ పుణ్యమా అని నాన్నతో రోజుల తరబడి.. నెలల కొద్దీ సమయం గడిపే అరుదైన అవకాశం దొరికింది. నిత్యం షూటింగుల బిజీ పేరుతో ఇంటిపట్టున దొరకని డాడీతో ఫుల్ గా ఎంజాయ్ చేసే ఛాన్స్ తమకు దొరికినందుకు నాన్న కూచీలు ఎంతో ఎగ్జయిట్ అవుతున్నారు. ముఖ్యంగా ఆ ఇద్దరు స్టార్ డాటర్స్ ఈ రేర్ మూవ్ మెంట్ ని 24/7 నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరూ? అంటే.. అల్లు అర్హ... సితార.
డాడీల బిజీ షెడ్యూల్స్ గురించి తెలుసు కాబట్టి తమకు లభించిన ఈ అరుదైన అవకాశాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు ఆ ఇద్దరూ. ఇక అల్లు అర్జున్ కుమార్తె అర్హ డాడీని తన వ్యాయామ భాగస్వామిగా ఎంపిక చేసుకుంది. తనకు కసరత్తులు చేయడంలో టిప్స్ చెప్పేది డాడీనే. ఇక ఆ ఇద్దరూ కసరత్తులు చేస్తూ చేసే అల్లరిని కెమెరాలో బంధించేందుకు స్నేహా రెడ్డి తెగ పోటీపడిపోతున్నారని తాజాగా రివీలైన కసరత్తుల ఫోటోలు చెబుతున్నాయి. ఆన్ లైన్ మాధ్యమంలో ఫోటోని పంచుకుంటూ `` మార్నింగ్ స్ట్రెచెస్ (sic)`` అనే వ్యాఖ్యను జోడించారు. అంతకు ముందు బన్ని షేర్ చేసిన వేరొక ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. తండ్రి కూతుళ్ల మధ్య సరదా సంగతులు అందరికీ ముచ్చట గొలిపాయి. అల్లు అర్జున్- స్నేహ తమ 9 వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది మార్చి లో జరుపుకున్నారు. ఈ దంపతులకు అల్లు అర్హా (3), కుమారుడు అల్లు అయాన్ (6) ఉన్నారు.
మరో వైపు డాడీ మహేష్ తో సితార ఈ క్వారంటైన్ టైమ్ ని ఫుల్ గా ఆస్వాధిస్తోంది. డాడీతో కలిసి రకరకాల ఆటలు ఆడుకుంటోంది. ఇంట్లోనే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. మహేష్ ని బాగానే అల్లరి పట్టిస్తుంది సితార. అందుకు సంబంధించిన ఫోటోల్ని.. వీడియోల్ని నమ్రత వీలున్న ప్రతిదీ ఇన్ స్టాలో షేర్ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఫ్యాన్స్ లో బోలెడంత వైరల్ అవుతున్నాయి. ఇక కూతురుపై తండ్రికి ఉండే ఎఫెక్షన్ వేరు. తల్లికి కొడుకుపై ఉంటే.. తండ్రికి కూతురుపైనే ఎక్కువ ప్రేమాభిమానాలు ఉంటాయని చెబుతుంటారు. ఆ సన్నివేశం ఈ క్వారంటైన్ టైమ్ లో ఆవిష్కృతమవుతోంది. సెలబ్రిటీలంతా ఇండ్లలో కుటుంబంతో స్పెండ్ చేస్తుంటే ఇవన్నీ బయట పడుతున్నాయన్నమాట. బన్ని తదుపరి సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` అనే చిత్రాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. మహేష్ తదుపరి పరశురామ్ దర్శకత్వం లో నటించేందుకు రెడీ అవుతున్నారు. కరోనా లాక్ డౌన్ ఎత్తి వేస్తే కానీ షూటింగులపై ఏదీ క్లారిటీ రాదు.