కన్నడ మీడియాకు బన్నీ క్షమాపణలు
దక్షిణాదిలో కన్నడ, తమిళ వర్గాలలో ప్రాంతీయ అభిమానం ఎక్కువగా వుంటుందన్నది తెలిసిందే. అది చాలా సందర్భాల్లో బయటపడింది కూడా. తాజాగా కన్నడ మీడియా ఆలస్యంగా వచ్చిన `పుష్ప` టీమ్‌పై అసంతృప్తిని వెల్లగక్కి తమ ప్రాంతీయ అభిమానాన్ని మరోసారి బయటపెట్టింది. మరీ ఇంత ఆలస్యంగా వస్తారా? అంటూ చిత్ర బృందాన్ని నిలదీసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప : ది రైజ్`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 17న వరల్డ్ వైడ్‌గా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర బృందం ప్రచారం మొదలుపెట్టింది.
తాజాగా చిత్ర బృందం బెంగళూరులో ప్రచారం కోసం వెళ్లింది. అక్కడ `పుష్ప` టీమ్ కు చేతు అనుభవం ఎదురైంది. ప్రత్యేకంగా మీడియాని కలవడానికి బెంగళూరు వెళ్లిన `పుష్ప` టీమ్ 11:15 గంటలకు ప్రారంభించాల్సిన మీడియా సమావేశాన్ని 1:15 గంటలకు స్టార్ట్ చేసింది. ఈ ప్రచార కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, కన్నడ నటుడు ధనుజయ స్టేజ్ పై కూర్చున్నారు. ఒకరి తరువాత ఒకరు ఇంగ్లీష్ లో మాట్లాడటం నచ్చని ఓ మీడియా ప్రతినిధి `పుష్ప` టీమ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
`మీ టీమ్ ప్రెస్ మీట్ ని 11:15 గంటలకు ప్రారంభిస్తున్నట్టుగా తెలిపింది. కానీ మీరు 1:15 గంటలకు వచ్చారు. ఇది ఎంత వరకు సమంజసం? . హైదరాబాద్ లో జరిగిన పుష్ప ఈవెంట్ లో యాంకర్ సుమ తెలుగులో మాట్లాడింది. కానీ ఈ యాంకర్ మాత్రం కన్నడ మీడియా ముందు ఇంగ్లీష్ లో మాట్లాడుతోంది ఏంటిది? అని ఓ జర్నలిస్ట్ `పుష్ప` టీమ్ పై అసహనాన్ని వ్యవక్తం చేశాడు. సదరు జర్నిలిస్ట్ కన్నడలో అడిగిన మాటల్ని హీరోయిన్ రష్మిక హీరో బన్నీకి వివరించింది. వెంటనే విషయం అర్థమైన బన్నీ `ఆలస్యమైనందుకు క్షమించండి. మేము ప్రైవేట్ జెట్ లో వచ్చాం. పొగ మంచు కారణంగా ఫ్లైట్ టేకాఫ్ లో ఇబ్బందులు తలెత్తాయి, అందుకే ఈ కార్యక్రమం ఆలస్యమైంది. మీడియా అందరికి నా క్షమాపణలు. క్షమాపలు చెబుతున్నందుకు నాకు బాధలేదు. సారి చెప్పడం వల్ల ఓ మనిషి తగ్గడు.. పెరుగుతాడని నా అభిప్రాయం` అన్నాడు బన్నీ.
ఇదిలా వుంటే ఆ తరువాత `పుష్ప` టీమ్ పై ప్రశ్నల వర్షం కురిపించిన కన్నడ మీడియా ఈ చిత్రానికి వీరప్పన్ కు ఏదైనా సంబంధం వుంటుందా? అని ప్రశ్నించింది. దీనికి బన్నీ సరైన సమాధానం చెప్పారు `పుష్ప` గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఫిక్షనల్ స్టోరీ అని బన్నీ వివరణ ఇచ్చాడు. ఆ తరువాత మీడియా రష్మికని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. కన్నడ నటి కదా కన్నడలో మీరే డబ్బింగ్ చెప్పొచ్చుకదా అని ప్రశ్నించారు. దీనికి రష్మిక కూడా స్మార్ట్ గా వ్యవహరించి సమయం లేకపోవడం వల్లే తాను డబ్బింగ్ చెప్ప లేదని డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించారని, పార్ట్ 2కి తానే డబ్బింగ్ చెబుతానని వివరణ ఇచ్చింది.