తారక్‌.. బన్నీ.. ఎందుకిలా??

Update: 2015-06-28 09:44 GMT
ఎన్టీఆర్‌, బన్నీ.. ఈ ఇద్దరినీ కన్ఫ్యూజన్‌ మాష్టర్లు అంటే తప్పేం లేదు. ఎందుకంటే ఈ ఇద్దరూ ఎంపికల్లో కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు. గెలుపులో కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లోనూ కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు.

అంతెందుకు ఇటీవలి కాలంలో సుకుమార్‌ లాంటి క్లాస్‌ డైరెక్టర్‌కి ఛాన్సిచ్చి ఎన్టీఆర్‌ పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ కథాంశాన్ని సుక్కూ ఇస్తాడని అతడు ఎలా ఊహించాడు? అలాగే మాస్‌ అప్పీల్‌తో రికార్డులు తిరగరాసే సినిమాల్ని సుక్కూ కెరీర్‌లో ఊహించగలమా? కానీ అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్‌. ఆ విలక్షణత అతడికి మాత్రమే సొంతం అనుకుంటే ఇంతలోనే బన్ని కూడా అదే తీరుగా అభిమానుల్ని కన్ఫ్యూజన్‌లోకి నెట్టేస్తూ మాస్‌ డైరెక్టర్‌ బోయపాటికి అవకాశం ఇచ్చాడు.

అరతేనా ఈ ఇద్దరూ కథల్ని ఓకే చేయడానికే నెలల కొద్దీ సమయం తీసుకున్నారు. నచ్చేవరకూ సెట్స్‌కెళ్లం అన్న తీరుగా ప్రవర్తించారు. అంతేనా? ఇటీవలి కాలంలో ఈ ఇద్దరూ గుబురు గెడ్డాలు వేసుకుని తిరుగుతున్నారు. ఎన్టీఆర్‌ 'మా నాన్నకు ప్రేమతో' షూటింగ్‌ కోసమే ఇలా చేశాడని తెలిసింది. అయితే బన్ని దేనికోసం ఇలా గెడ్డం పెంచాడు? బోయపాటి సినిమా కోసమేనా? మొన్నటి ఫిలింఫేర్‌లో బన్ని గెడ్డం చూసినవాళ్లకు ఇదే సందేహం వచ్చింది.

ఏదేమైనా ఈ ఇద్దరినీ కన్ఫ్యూజన్‌ మాష్టర్లు అంటే తప్పేం కాదు.

Tags:    

Similar News