ప్రకటన సరే కానీ బన్నీతో సినిమా ఎప్పుడు?
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ తో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది ఆలియాభట్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న ఈ బ్యూటీ ప్రతిభకు తెలుగు ఆడియెన్ సైతం మైమరిచిపోవడం ఖాయమని జక్కన్న నమ్మకంగా చెబుతున్నారు. చరణ్ (అల్లూరి) సరసన సీత పాత్రలో ఆలియా నటిస్తోంది. ఇంతకుముందు రిలీజైన ఫస్ట్ లుక్ తో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసింది ఈ క్యూటీ.
ఆర్.ఆర్.ఆర్ తర్వాతా మరో పాన్ ఇండియా మూవీకి ఆలియాను లాక్ చేస్తున్నారని ప్రచారమైంది. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లోని పాన్ ఇండియా మూవీ కోసం ఆలియాతో సంప్రదింపులు జరిపారని ప్రచారం సాగింది. అలాగే బన్ని నటించనున్న తదుపరి పాన్ ఇండియా చిత్రంలోనూ ఆలియాను కథానాయికగా నటింపజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఇటీవల గుసగుసలు వినిపించాయి.
చూస్తుండగానే ఆలియా టాలీవుడ్ లోనూ అగ్ర నాయిక హోదాను అందుకుంటోందని సాటి ముంబై బ్యూటీ పూజా హెగ్డేకి పోటీగా మారుతోందని అర్థమవుతోంది. ఇక టాలీవుడ్ సర్కిల్స్ లో మహేష్ .. బన్ని లాంటి స్టార్ హీరోల సరసన ఆలియా నటించే వీలుంది కాబట్టి లోకల్ రేస్ లో తనను ఇతర భామలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట.
ఇప్పటికే పాన్ ఇండియా కథానాయికగా పాపులారిటీ సంపాదించుకున్న ఆలియా తాజాగా సౌత్ లోనూ ప్రముఖ కమర్షియల్ బ్రాండ్లకు ప్రచారం చేసేస్తోంది. తాజాగా బన్ని సరసన ఫ్రూటీ బ్రాండ్ కి ప్రచారం చేస్తోంది. బన్నీతో కలిసి ఆలియా భట్ ఫ్రూటీని ఎంజాయ్ చేస్తున్న థీమ్ ని ప్రకటనలో చూపించారు. అందమైన అమ్మాయి అబ్బాయి పాపం ఎడారిలోని ఓ బస్ స్టాప్ వద్ద వేచి చూస్తుంటారు. అసలే దాహం.. అది తీరాలంటే పానీయం అందాలి. పానీయం ఆ ఇద్దరి చెంతకు చేరుతుంది. ప్రకటన చూడగానే బాగా పాతబడిన ఔట్ డేటెడ్ థీమ్ అనిపిస్తుంది.. ప్రస్తుతానికి కొత్త ముఖాలతో ఈ థీమ్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
ప్రకటన సరే కానీ.. బన్నీతో సరసన కథానాయికగా నటించేది ఎపుడు? అంటూ అభిమానులు ఆలియాని ప్రశ్నిస్తున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే అందుకు సమాధానం వస్తుందేమో చూడాలి.Full View
ఆర్.ఆర్.ఆర్ తర్వాతా మరో పాన్ ఇండియా మూవీకి ఆలియాను లాక్ చేస్తున్నారని ప్రచారమైంది. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లోని పాన్ ఇండియా మూవీ కోసం ఆలియాతో సంప్రదింపులు జరిపారని ప్రచారం సాగింది. అలాగే బన్ని నటించనున్న తదుపరి పాన్ ఇండియా చిత్రంలోనూ ఆలియాను కథానాయికగా నటింపజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఇటీవల గుసగుసలు వినిపించాయి.
చూస్తుండగానే ఆలియా టాలీవుడ్ లోనూ అగ్ర నాయిక హోదాను అందుకుంటోందని సాటి ముంబై బ్యూటీ పూజా హెగ్డేకి పోటీగా మారుతోందని అర్థమవుతోంది. ఇక టాలీవుడ్ సర్కిల్స్ లో మహేష్ .. బన్ని లాంటి స్టార్ హీరోల సరసన ఆలియా నటించే వీలుంది కాబట్టి లోకల్ రేస్ లో తనను ఇతర భామలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట.
ఇప్పటికే పాన్ ఇండియా కథానాయికగా పాపులారిటీ సంపాదించుకున్న ఆలియా తాజాగా సౌత్ లోనూ ప్రముఖ కమర్షియల్ బ్రాండ్లకు ప్రచారం చేసేస్తోంది. తాజాగా బన్ని సరసన ఫ్రూటీ బ్రాండ్ కి ప్రచారం చేస్తోంది. బన్నీతో కలిసి ఆలియా భట్ ఫ్రూటీని ఎంజాయ్ చేస్తున్న థీమ్ ని ప్రకటనలో చూపించారు. అందమైన అమ్మాయి అబ్బాయి పాపం ఎడారిలోని ఓ బస్ స్టాప్ వద్ద వేచి చూస్తుంటారు. అసలే దాహం.. అది తీరాలంటే పానీయం అందాలి. పానీయం ఆ ఇద్దరి చెంతకు చేరుతుంది. ప్రకటన చూడగానే బాగా పాతబడిన ఔట్ డేటెడ్ థీమ్ అనిపిస్తుంది.. ప్రస్తుతానికి కొత్త ముఖాలతో ఈ థీమ్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
ప్రకటన సరే కానీ.. బన్నీతో సరసన కథానాయికగా నటించేది ఎపుడు? అంటూ అభిమానులు ఆలియాని ప్రశ్నిస్తున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే అందుకు సమాధానం వస్తుందేమో చూడాలి.