అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో బన్నీ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ బ్రాండ్ వాల్యూ పెరిగినట్లు అభిమానులు భావిస్తున్నారు. అయితే ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా అల్లు అర్జున్ ఒదిగి ఉంటారనడానికి ఇటీవల జరిగిన విషయాలను ఉదాహరణలుగా చెప్పవచ్చు.
'పుష్ప' పార్ట్-1 ప్రమోషన్స్ లో భాగంగా బెంగుళూరు వెళ్లిన అల్లు అర్జున్.. ప్రెస్ మీట్ కు ఆలస్యంగా వచ్చినందుకు అక్కడి మీడియాకు క్షమాపణలు చెప్పారు. పొగమంచు కారణంగా ప్రైవేట్ ఫ్లైట్ టేకాఫ్ లో ఇబ్బందులు తలెత్తాయనే కారణాన్ని వెల్లడించిన బన్నీ.. సారీ చెప్పడం వల్ల మనిషిగా పెరుగుతాడని.. ఎక్కడా తగ్గడని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు లేటెస్టుగా 'శ్యామ్ సింగరాయ్' చిత్ర బృందానికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న 'రౌడీ బాయ్స్' సినిమా ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ భాగం అయ్యారు. సినిమాలోని డే అండ్ నైట్ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ కు గెస్టుగా హాజరైన బన్నీ.. సినిమా సక్సెస్ అవ్వాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇటీవల విజయం సాధించిన 'అఖండ' 'పుష్ప' 'శ్యామ్ సింగరాయ్' సినిమాల గురించి స్టార్ హీరో మాట్లాడారు.
బన్నీ మాట్లాడుతూ.. 'శ్యామ్ సింగరాయ్' సినిమా గురించి మాట్లాడేందుకు ఇంతకు ముందు సరైన సమయం దొరకలేదు. సక్సెస్ సాధించిన చిత్ర బృందం మొత్తాన్ని ఈ వేదికగా అభినందిస్తున్నాను. సినిమా చాలా బాగుంది. లాస్ట్ టైం చెప్పాలని అనుకొని నేను మర్చిపోయాను. దానికి నేను క్షమాపణలు కోరుతున్నా. నాని - సాయి పల్లవి పెర్ఫార్మన్స్ చాలా చాలా బాగుంది అని అన్నారు.
''దర్శకుడు సినిమాని హ్యాండిల్ చేసిన విధానం బాగా నచ్చింది. మ్యూజిక్ తో పాటుగా అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ను అభినందిస్తున్నా. థియేటర్ లో మిస్ అయిన వారు సినిమాని ఓటీటీలో తప్పకుండా చూడండి. గ్రేట్ అటెంప్ట్. మీ అందరికీ నచ్చుతుంది.. నచ్చాలని కోరుకుంటున్నాను. అలానే సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
వేరే సినిమాలు సక్సెస్ అయినందుకు నటీనటులను సాంకేతిక నిపుణులను ప్రశంసించడమే కాకుండా.. ప్రత్యేకంగా వారికి క్షమాపణలు కూడా చెప్పడం బన్నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సార్ అల్లు అర్జున్ బ్రాండ్ అని అంటున్నారు.