• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క‌ళ్యాణ్ రామ్ అంటే...

క‌ళ్యాణ్ రామ్ అంటే గౌర‌వం!- అల్లు అర్జున్

By - Tupaki Desk
Update: 2022-08-07 11:44 GMT
టాలీవుడ్ హీరోగా నిర్మాత‌గా నందమూరి కళ్యాణ్ రామ్ రాజీ లేని ప్ర‌యోగాల గురించి తెలిసిందే. గ‌ట్సీ నిర్మాత ఇప్పుడు మ‌రోసారి `బింబిసార`తో అలాంటి ప్ర‌యోగ‌మే చేశాడు క‌ళ్యాణరాముడు. ఇందులో ప్రయోగాత్మ‌క పాత్ర‌తో అద‌ర‌గొట్టాడు.

ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై క్రిటిక్స్ నుంచి సామాన్య ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటోంది. క‌ళ్యాణ్ రామ్ న‌ట‌న డెబ్యూ డైరెక్ట‌ర్ ప్ర‌తిభ‌ను కొనియాడ‌ని వారు లేరు. మూవీ బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్ల ప‌రంగానూ దూసుకుపోతోంది. నూతన దర్శకుడు వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామాని నిర్మించింది.

వ‌రుస‌గా సెల‌బ్రిటీలు ఈ మూవీ ప్రివ్యూలు వీక్షించి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చూసిన తర్వాత టీమ్ మొత్తాన్ని అభినందించారు. బింబిసార బృందం పై తన ట్విట్టర్ హ్యాండిల్ లో ప్ర‌శంస‌లు కురిపించాడు. క‌ళ్యాణ్ రామ్ అంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని బ‌న్ని వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు.

``#బింబిసార బృందానికి బిగ్ విషెస్.. చాలా ఆసక్తికరమైన ఆకర్షణీయమైన ఫాంటసీ చిత్రమిది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ గారి ప్రభావవంతమైన ఉనికిని చాటింది. ఎప్పుడూ కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీలోకి తీసుకువస్తూ కొత్త తరహా సినిమాలను ట్రై చేస్తున్నందుకు ఆయనంటే నాకు గౌరవం.  దీన్ని బాగా హ్యాండిల్ చేసినందుకు డెబ్యూ డైరక్టర్ వ‌శిష్ట‌ను నేను అభినందిస్తున్నాను. టెక్నీషియన్స్- ఆర్టిస్టులందరికీ అభినందనలు. ఎంఎం కీర‌వాణి గారు కేథ‌రిన్ థ్రెసా.. సంయుక్త‌.. NTR ఆర్ట్స్ అంద‌రికీ.. ఈ చిత్రం అన్ని వయసుల వారికి వినోదం అందిస్తుంది`` అని అల్లు అర్జున్ బింబిసారను ప్రశంసించారు.

మెగాస్టార్ చిరంజీవి - అల్లు అర్జున్ స‌హా ప‌లువురు టాప్ స్టార్లు క‌ళ్యాణ్ రామ్ బింబిసార‌ను ప్ర‌శంసించ‌డం ఈ సినిమా ప‌బ్లిసిటీకి కూడా పెద్ద ప్ల‌స్ కానుంది. మునుముందు ఈ చిత్రానికి క‌లెక్ష‌న్లు పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఈ వీకెండ్ లో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించి తొలి వారంలో వ‌సూళ్ల‌ను పెంచుకుంటే.. బ్రేక్ ఈవెన్ సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఈ విజ‌యంతో క‌ళ్యాణ్ రామ్ మ‌రిన్ని ప్ర‌యోగాత్మ‌క సినిమాల్ని తెర‌కెక్కించేందుకు ఊత‌మిచ్చిన‌ట్ట‌వుతుంది.
Tags:    
  • Allu Arjun 
  • Kalyan Ram 
  • Bimbisara 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS