ఆహను పాపులర్ చేసేందుకు విశ్వప్రయత్నాలు!

Update: 2020-03-29 03:30 GMT
ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు భారీ ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ పీరియడ్ కావడంతో అందరూ అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ లాంటి ఈ ప్లాట్ ఫామ్స్ ను వదలడం లేదు. కొద్ది రోజుల క్రితమే అల్లు అరవింద్ ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ బిజినెస్ లో కి ఆహ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇతర సక్సెస్ ఫుల్ ఫ్లాట్ ఫామ్స్ తరహాలో కాకుండా ఒరిజినల్ కంటెంట్ తక్కువగా ఉండడం.. ఎక్కువ సినిమాలు లేకపోవడం తో పెద్దగా ఆదరణ దక్కడం లేదు.

ఆహా కు సబ్ స్క్రైబర్ బేస్ ను పాపులారిటీ పెంచేందుకు ఆహ యాప్ ఫైనాన్షియర్స్ నడుం బిగించారట. నెట్ ఫ్లిక్స్.. అమెజాన్ ప్రైమ్ లో పనిచేసిన నిపుణులను రంగంలోకి దించి ఆహాను ఓ ప్రముఖమైన ఒటీటీ ప్లాట్ ఫామ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. వెంటనే కాకపోయినా నెమ్మదిగా ఫలితాలు వస్తాయని కొందరు అంటున్నప్పటికీ యాప్ పై పెట్టుబడి పెట్టినవారు మాత్రం కొంత అసహనంగా ఉన్నారట. భవిష్యత్తు సంగతేమో కానీ ప్రస్తుతానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఆహకు అదరణ దక్కడం లేదట.

ఒటీటీ ప్లాట్ ఫామ్స్ కు.. వాటి యాప్స్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో ఆహకు పాపులారిటీ రాకపోతే భవిష్యత్తులో ప్రమోషన్స్ చేయడం కోసం మరింత ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని వారు కలవరపడుతున్నారట. మరి ఈ మొదటి తెలుగు యాప్ ఎంతమేర విజయవంతం అవుతోందో.. డిజిటల్ రంగంలో ఏ స్థాయిలో దూసుకెళ్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News