చిరు చాణక్యుడు రంగంలోకి దిగాడా?

Update: 2015-10-29 11:33 GMT
మాస్టర్ మైండ్ లను చాణక్యులుగా పిలుచుకుటారు మనోళ్లు. చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడం వెనుక.. అల్లు అరవింద్ తెలివితేటలు కూడా తోడయ్యాయన్నది జగమెరిగిన సత్యమే. ఈ విషయాన్ని నేరుగా కాకపోయినా.. తమ అనుబంధాన్ని ఇన్ డైరెక్టుగానే చాలాసార్లు చెప్పారు చిరు. ఇప్పుడు చిరు తనయుడు చిరుత కోసం.. అల్లు అరవింద్ మరోసారి తన మేథస్సుకు పదును పెట్టే పనిలో పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరోల్లో చరణ్ - అల్లు అర్జున్ లు స్టార్ స్టేటస్ లో ఉన్నారు.

ఒక్కో సినిమాకి స్థాయి పెంచుకుంటూ బన్నీ రేంజ్ ఓ రేంజ్ కి చేరింది. కానీ రామ్ చరణ్ మాత్రం ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. గతేడాది వచ్చిన గోవిందుడు అందరివాడేలే యావరేజ్ కాగా.. ఈ ఏడాది బ్రూస్ లీ నిరుత్సాహకర ఫలితాన్ని ఇచ్చింది. దీంతో చరణ్ కెరీర్ ని చక్కదిద్దే పనిని అల్లు అరవింద్ తీసుకున్నాడని తెలుస్తోంది. నిజానికి చెర్రీకి రెండో సినిమా అయిన మగధీరతోనే స్టార్ స్టేటస్ దక్కడంలో.. అల్లు అరవింద్ నిర్మాణ వ్యూహాలున్నాయని ఒప్పుకోవాలి. ఆ తర్వాత చరణ్ కి సంబంధించిన నిర్ణయాలు చిరంజీవే తీసుకుంటూ వచ్చారు.

చెర్రీ కెరీర్ లో హిట్స్ చాలానే ఉన్నా బ్లాక్ బస్టర్ మాత్రం పడడం లేదు. దీనికి తోడు ఇప్పుడు కెరీర్ నెమ్మదించే స్థితి వచ్చింది. ప్రస్తుతం తమిళ మూవీ తని ఒరువన్ ని చరణ్ రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించాల్సి ఉండగా.. ఇప్పుడా బాధ్యతలు అల్లు అరవింద్ చేపట్టనున్నాడని, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారన్నది లేటెస్ట్ టాక్. చరణ్ కోరిక మేరకు.. దీనికి అల్లు అరవింద్ కూడా అంగీకరించాడని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

Tags:    

Similar News