• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లు వారిది రివర్స్...

అల్లు వారిది రివర్స్ ప్లానా?

By - Tupaki Desk
Update: 2018-04-30 17:30 GMT
మెగా ఫ్యామిలీ ఇప్పుడు ప్రతికూల విషయాల్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రణాళికను గట్టిగానే అమలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ ను బూతు తిట్టిన ఉదంతం విషయంలో అల్లు అరవింద్.. నాగబాబు లాంటి వాళ్లు కొంచెం అతిగానే స్పందించిన భావన కలిగింది జనాలకు. పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశాడని.. తన తల్లి పేరును పదే పదే ప్రస్తావించి.. సంబంధిత వీడియోలను మళ్లీ మళ్లీ షేర్ చేసి సెంటిమెంటు పండించడానికి ప్రయత్నించాడని ప్రత్యర్థులు విమర్శించారు.

ఇప్పుడిక అల్లు అరవింద్ కూడా తన కొడుకు అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య’కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా చేసినవే అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఇండస్ట్రీలో తలెత్తిన పరిణామాలు.. తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఈ సినిమాను లక్ష్యంగా చేసుకోవచ్చన్నది ఆయన సందేహం. ప్రత్యర్థులు ఎవరు అని చెప్పకపోయినా కొన్ని టీవీ ఛానెళ్లను ఉద్దేశించే ఆయనీ వ్యాఖ్యలు చేశారని అందరూ భావిస్తున్నారు. ఐతే నిజంగా ఇలా ఆ సినిమా గురించి కుట్ర జరుగుతోందా అన్నది సందేహం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అలా జరగొచ్చేమో అనే సందేహంతో.. లేదా ఈ సినిమాపై డివైడ్ టాక్ రావొచ్చన్న అనుమానంతోనో ముందే ఆయన వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశాడని భావిస్తున్నారు.  ఇలా చేయడం వల్ల అవతలి వాళ్లను ముందే డిఫెన్సులోకి నెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారేమో అనిపిస్తోంది.

ఇక్కడొక కీలకమైన విషయం ఏంటంటే.. పవన్ తనకు వ్యతిరేకంగా కుట్ర చేశాయని పేర్కొన్న ఒక టీవీ ఛానెల్లోనూ నిన్నటి ‘నా పేరు సూర్య’ ఆడియో లైవ్ ఇచ్చారు. ఇటు అల్లు అరవింద్.. అటు రామ్ చరణ్ ఇద్దరూ కూడా మీడియాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆ ప్రసంగాల్ని మీడియానే రిపోర్ట్ చేస్తోంది. టెలికాస్ట్ చేస్తోంది. తమ ప్రచారానికి మీడియానే కావాలి. అయినా మీడియానే లక్ష్యంగా చేసుకుంటారు. శ్రీరెడ్డి వ్యవహారంలో కొన్ని టీవీ ఛానెళ్లు అతి చేసిన సంగతి వాస్తవమే. కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న తప్పుల గురించి ఎవరో ఆరోపణలు చేస్తే వాటిని రిపోర్ట్ చేయడమే తప్పు.. ఇక్కడ ఏ తప్పూ జరగట్లేదని మాట్లాడటమే విడ్డూరం.
Tags:    
  • Allu Aravind 
  • Media 
  • Naa Peru Surya Movie 
  • Telugu News 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS