• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లరి నరేష్ 'నాంది'...

అల్లరి నరేష్ 'నాంది' టెర్రిఫిక్ లుక్...!

By - Tupaki Desk
Update: 2020-06-27 12:57 GMT
అల్లరి నరేష్ తన పంథా మార్చుకొని నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘నాంది’. ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న ఎస్‌.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై నిర్మిస్తున్నారు. అల్ల‌రి న‌రేశ్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందిన 'నాంది' - ఎ న్యూ బిగినింగ్’ సామాజిక అంశాలతో కూడిన క్రైమ్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు కామెడీ చిత్రాలతో అలరించిన అల్ల‌రి న‌రేష్‌ తన శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ కథనాలతో ఈ సినిమా ఉండబోతోంది. ఇటీవల ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇవ్వడంతో దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.

కాగా ఇప్పటికే విడుదలైన 'నాంది' ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ ఒంటి మీద దుస్తులు లేకుండా గాయాలతో తల కిందులుగా వేళాడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్టుగా జూన్ 30న ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయబోతున్నట్లు అల్లరి నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ''జూన్ 30, మంగళవారం - మీరందరూ 'నాంది' యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయడానికి సాక్ష్యంగా నిలవండి'' అంటూ ట్వీట్ చేసారు. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ ఒంటి పై నూలు పోగు లేకుండా నగ్నంగా తన రెండు చేతులను తల వెనుక పెట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ లో అల్లరి నరేష్ టెర్రిఫిక్ లుక్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగేలా చేసింది. జూన్ 30న రాబోయే ఎఫ్.ఐ.ఆర్ (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్) కోసం ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్‌ కుమార్‌ - హ‌రీష్ ఉత్తమ‌న్‌ - ప్రియ‌ద‌ర్శి - ప్రవీణ్ కీల‌క పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కోసం ఉన్న‌త స్థాయి సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌ సంగీతం అందించగా బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సిద్ జే సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి చోటా కె. ప్ర‌సాద్‌ ఎడిటర్ గా వర్క్ చేసారు. ఇక 'నాంది' చిత్రానికి ప్రముఖ రచయితా అబ్బూరి ర‌వి సంభాష‌ణ‌లు అందించారు.
Tags:    
  • Allari Naresh 
  • Naandi 
  • First look poster 
  • First Impact on june 30 

Similar News

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS