• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లరి నరేష్ నటిస్తుంది...

అల్లరి నరేష్ నటిస్తుంది కొరియన్ సినిమాలోనా..!

By - Tupaki Desk
Update: 2020-03-13 09:30 GMT
అల్లరి నరేష్ ఈ పేరు వింటేనే మన పెదాలపై చిరునవ్వు చిగురిస్తుంది. ఎందుకంటే అతని సినిమాలలో ఉండే సందడే వేరు. తన కెరీర్ లో అల్లరి సినిమా తో హిట్ మొదటి హిట్ అందుకొని సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. కెరీర్ ప్రారంభమైన కొంతకాలంలోనే తన హావభావాలతో, కామెడీ టైమింగ్ తో మంచిపేరును సంపాదించుకున్నాడు.

మంచి కామెడీ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పెద్ద హీరోలకు ధీటుగా నిలబడ్డాడు. కానీ గత రెండేళ్లుగా తన నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. గతేడాది మహర్షి మూవీ లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు తప్ప హీరోగా రాలేదు. ఫ్రెండ్ గా సక్సెస్ అయ్యాడనుకోండి.. కానీ ప్రేక్షకులు ఆశించిన అల్లరి అందులో లేదు. పూర్తి ఎమోషనల్ పాత్రలో కనిపించాడు.

ఇప్పటికి సినీ అభిమానులు అల్లరి నరేష్ నుండి కొత్త సినిమాలను కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న హీరోలలో కామెడీని వంద శాతం పండించే వాళ్ళు లేరనే చెప్పాలి. ఆ మధ్యలో సునీల్ చాలా ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. ఆఖరికి మళ్లీ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. కానీ అల్లరి నరేష్ ని మాత్రం ఎప్పటికి హీరో లాగానే ప్రేక్షకులు ఆదరిస్తారు.

ఇదిలా ఉండగా ఈ ఏడాది అల్లరి నరేష్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరయిన్ గా ఒక చిత్రం రూపొందుతుందని సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాజల్ కూడా హిట్లు లేక ఖాళీగా ఉండటం ఎందుకని అనుకుందేమో వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటున్నట్లుంది. ఏది ఏమైనా వీరి కలయికనే ఆశ్చర్యానికి గురిచేసిందంటే.. ఆ సినిమా కొరియన్ రీమేక్ ఫిల్మ్ అనేసరికి ఇంకాస్త ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కొరియన్ సినిమా డ్యాన్సింగ్ క్వీన్ ను రీమేక్ చేస్తున్నట్లు సురేష్ ప్రొడక్షన్స్ వారు తెలిపారు. అసలు సంగతేంటో తెలియాలంటే కొంతకాలం ఆగాలి మరి..
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • allari naresh 
  • korean remake 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS