• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  30 ఏళ్ల కిందటే కొమురం భీం...

30 ఏళ్ల కిందటే కొమురం భీం సినిమా? చరిత్ర ఏంటి?

By - Tupaki Desk
Update: 2020-10-24 14:30 GMT
చరిత్ర దాచిన తెలంగాణ స్వాత్రంత్య సమరయోధుడు ‘కొమురంభీం’ జల్, జంగల్, జమీన్ అంటూ ఆదివాసీల కోసం బంధూకు పట్టి పోరాడిన ధీరుడు. అలాంటి ఉద్యమ కారుడి చరిత్ర తాజాగా టాలీవుడ్ లో తెరకెక్కుతోంది. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ‘ఆర్ఆర్ఆర్’ ను తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీంగా కన్పించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ సంబంధించిన టీజర్లు విడుదలై నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ కు ధీటుగా ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ఉందనే టాక్ విని పిస్తోంది.

తాజాగా విడుదలైన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులను ఎంతోగానో ఆకట్టుకుంది. అయితే ఈ టీజర్ పై అనేక విమర్శలు.. వివాదాలు వచ్చాయి. టీజర్ చివర్లో ఎన్టీఆర్(కొమురంభీమ్)ను ముస్లిం గెటప్ లో చూపించడంపై చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కొమురంభీమ్ ఎవరు? ఆయన చరిత్ర ఏంటనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. జల్‌(నీళ్లు).. జమీన్‌(భూమి).. జంగల్‌(అడవి).. పేరుతో పోరాటం చేసిన వీరుడు కొమురంభీం అని చెప్పుకుంటున్నారు. 1901లో జన్మించిన కొమరం భీమ్‌.. అల్లూరి సీతరామరాజు స్ఫూర్తిగా అడవి బిడ్డల కోసం పోరాటం చేశాడని.. ఆయన తన 39వ ఏట పోలీసుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడనే విషయాన్ని చరిత్రకారులు గుర్తు చేస్తున్నారు.

కొమురంభీం జీవితాధారంగా 30ఏళ్ల కిందటే ‘కొమురంభీం’ చిత్రాన్ని దర్శకుడు అల్లాణి శ్రీధర్‌ తెరకెక్కించాడు. రూ.16లక్షల వ్యయంతో ‘కొమరం భీమ్‌’ చిత్రం అప్పట్లో నిర్మించారు. ఈ సినిమాలో కొమురంభీంగా భూపాల్‌ నటించాడు. మౌనిక, తెలంగాణ శకుంతల, షరీఫుద్దీన్‌, యాదగిరి ప్రధాన పాత్రల్లో నటించారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని వాంకిడి, జోడెఘాట్‌ ప్రాంతాల్లో 1935-40 మధ్యకాలంలో జరిగిన గోండ్ల పోరాటాన్ని దర్శకుడు కళ్లకు కట్టినట్లు ‘కొమరం భీమ్‌’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా గురించి తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలో ప్రస్థావన ఉండటం గమనార్హం. రాజమౌళి సినిమా కేవలం ఫిక్షనల్ కావడంతోనే ఆయన కొమురంభీంను ముస్లిం గెటప్ లో చూపించి ఉంటారనే టాక్ విన్పిస్తోంది.
Tags:    
  • Komaram Bheem 
  • Movie 
  • Allani Sreedhar 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS