• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఛారిత్రాత్మక తాజ్‌ లో...

ఛారిత్రాత్మక తాజ్‌ లో స్టార్ కపుల్ రిసెప్షన్‌

By - Tupaki Desk
Update: 2022-04-11 00:30 GMT
బాలీవుడ్ స్టార్‌ హీరో రణబీర్ కపూర్ మరియు హీరోయిన్‌ ఆలియా భట్ ల ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు దారి తీసింది. ఇద్దరి కుటుంబ సభ్యుల ఒప్పందంతో వీరిద్దరు ఏప్రిల్‌ 14వ తారీకున ఒక్కటి కాబోతున్న విషయం తెల్సిందే. గత రెండు మూడు సంవత్సరాలుగా వీరిద్దరి వివాహం గురించి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు వీరి వివాహం జరుగబోతుంది.

పెళ్లి హడావిడి మొదలు అయ్యింది. బాలీవుడ్‌ ప్రముఖులు మరియు సెలబ్రెటీలు అంతా కూడా ఈ పెళ్లి వేడుకలో ప్రథాన గెస్ట్‌ లుగా ఉండబోతున్నారు. ప్రముఖులకు ఇప్పటికే ఈ జోడీ ఆహ్వానం అందించారు. పెళ్లికి లిమిటెడ్‌ గా ఆహ్వానాలు అందించిన ఈ జంట రిసెప్షన్ కు మాత్రం ఎక్కువ మందిని ఆహ్వానించినట్లుగా బాలీవుడ్‌ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ఆలియా.. రణబీర్ ల పెళ్లి రిసెప్షన్‌ ను ఛారిత్రాత్మక తాజ్‌ మహల్‌ హోటల్ లో నిర్వహించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అధికారికంగా మీడియాకు వెళ్లడించలేదు కాని లీక్ ఇచ్చారని తెలుస్తోంది. ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు కలిసి ఏప్రిల్‌ 17వ తారీకున ఛారిత్రాత్మక తాజ్ మహల్‌ హోటల్ లో ఈ వింధు ను ఏర్పాటు చేశారట.

కొన్ని సంవత్సరాల క్రితం తాజ్‌ మహల్‌ హోటల్‌ పై టెర్రరిస్ట్‌ ల దాడి నేపథ్యంలో వార్తల్లో నిలిచిన ఆ హోటల్‌ మళ్లీ వీరి పెళ్లి రిసెప్షన్ తో హడావుడి అక్కడ కనిపించబోతుంది. భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలోనే రిసెప్షన్ ను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఆలియా మరియు రణబీర్ కపూర్ లు దాదాపుగా నాలుగు అయిదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. గతంలో రణబీర్‌ కపూర్ ఇతరులతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని పెళ్ల వరకు మాత్రం ఆ రిలేషన్‌ వెళ్లలేదు. ఆలియాతో ఆయన రిలేషన్ సుదీర్ఘ కాలంగా కొనసాగాలంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇటీవలే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆలియా త్వరలో మరో స్టార్‌ హీరో సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక హిందీలో ఈమె జోరు తగ్గేదే లేదు అన్నట్లుగా సాగుతోంది.

ఇటీవలే గంగూబాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రహ్మాస్త్ర సినిమా లో కూడా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా చాలా సినిమాల్లో ఈమె నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగే ఉద్దేశ్యంతోనే ఈ అమ్మడు ఉంది.
Tags:    
  • Alia bhatt 
  • Ranbir kapoor 
  • tollywood 
  • bollywood 
  • actress 
  • movie news 
  • latest news 
  • tupaki news 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS