మాల్దీవుల్లో సాగర తీరాన బాలీవుడ్ బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్స్..!
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో అందాల ముద్దుగుమ్మ ఆలియా భట్ ఒకరు. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కుమార్తెగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కృషి చేస్తోంది.
'హైవే' '2 స్టేట్స్' 'డియర్ జిందగీ' 'రాజీ' 'ఉడ్తా పంజాబ్' 'కలంక్' 'గల్లీ బాయ్' 'హంప్టీ శర్మా కీ దుల్హనియా' 'బద్రీనాథ్ కీ దుల్హనియా' వంటి హిట్ సినిమాలు అలియా భట్ ఖాతాలో ఉన్నాయి. ఇటీవల 'గంగూబాయి కతియావాడి' చిత్రంతో ప్రశంసలు అందుకున్న అలియా.. నిన్న మంగళవారానికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఆలియా భట్ మాల్దీవుల్లోని ఒక ప్రైవేట్ ఐలాండ్ లో తన సోదరి షాహీన్ భట్ మరియు తల్లి సోనీ రజ్దాన్ తో కలిసి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీనికి "ఇది 29.. అందరి ప్రేమకు ధన్యవాదాలు" అని క్యాప్షన్ పెట్టింది.
అలియా తన 29వ పుట్టిన రోజును ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి బీచ్ లో విశ్రాంతి తీసుకుంటూ.. రుచికరమైన భోజనం చేస్తూ.. సముద్రంలో యాచ్ రైడ్ తో విహరిస్తూ సంతోషంగా గడిపింది. ఈ వీడియోలో 'పుట్టినరోజు శుభాకాంక్షలు & నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అనే లైన్ తో కూడిన కార్డ్ ని కూడా చూడొచ్చు. బహుశా ఇది అలియా బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ పంపినది అయ్యుండొచ్చు.
ఇదిలా ఉంటే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో అలియా భట్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అలానే 'హార్ట్ ఆఫ్ స్టోన్' మూవీతో హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తన ప్రియుడు రణబీర్ కపూర్ - అమితాబ్ బచ్చన్ - కింగ్ నాగార్జునలతో కలిసి 'బ్రహ్మాస్త్ర' అనే పాన్ ఇండియా సినిమాలో అలియా హీరోయిన్ గా నటిస్తోంది. బర్త్ డే స్పెషల్ గా మంగళవారం ఆమె ఫస్ట్ లుక్ లాంచ్ చేయబడింది.
ఇక 'డార్లింగ్స్' 'జీ లే జరా' మరియు 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' వంటి సినిమాలు అలియా లైనప్ లో ఉన్నాయి. ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా మారి రెండు చేతులా సంపాదిస్తున్న హీరోయిన్ల జాబితాలోకి అలియా కూడా చేరిపోయింది. 'ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్' అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి.. షారుక్ ఖాన్ తో కలిసి ''డార్లింగ్స్'' సినిమా నిర్మిస్తోంది.