• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలియా భట్ హైదరాబాద్ రాక.....

అలియా భట్ హైదరాబాద్ రాక.. కాన్సల్??

By - Tupaki Desk
Update: 2021-05-19 09:30 GMT
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి నేమ్ ఇప్పుడు ఓ బ్రాండ్ అయిపోయింది. ఆయన సినిమాలకోసం దేశవ్యాప్తంగా సినీప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మల్టీస్టారర్ గా రూపొందుతుంది. ఈ పాన్ ఇండియా మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో చరణ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ జోడిగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు.

అయితే లాక్డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభించిన ఆర్ఆర్ఆర్ టీమ్.. ఆమెతో ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తి చేసేసింది. ఆర్ఆర్ఆర్ మూవీతో అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. అలాగే ఈ సినిమాకోసం అలియా ఆల్రెడీ తెలుగు కూడా నేర్చుకుంటోందట. ఈ సినిమాలో అలియా సీత అనే క్యారెక్టర్ పోషిస్తుంది. ఆ క్యారెక్టర్ కోసం అలియాను ఎందుకు ఎంచుకున్నారో ఇదివరకే రాజమౌళి తెలిపాడు. 'ఆర్ఆర్ఆర్ లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లేనప్పటికీ.. సీత క్యారెక్టర్ సినిమాకి ఇంపార్టెంట్. ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలతో పోటీపడి సీత క్యారెక్టర్ ఎమోషన్స్ పండించాలి. సీత అమాయకురాలు కానీ స్ట్రాంగ్ లేడీ. అందుకే ఆలియాను సెలెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

కానీ అమ్మడు తానే స్వయంగా క్యారెక్టర్ అడిగినట్లు ఇటీవలే క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. రాంచరణ్ - అలియా కాంబినేషన్ లో ఓ సాంగ్ షూట్ మిగిలి ఉందట. ఆ సాంగ్ ఈ వారాంతంలో ప్రారంభిద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అలియా నటిస్తున్న గంగుబాయ్ మూవీ డైరెక్టర్ సంజయ్ భన్సాలి కరోనా బారినపడటంతో అలియా క్వారంటైన్ లోకి వెళ్లిందట. అందుకే ప్రస్తుతం రాజమౌళి బృందం రాంచరణ్ తో షూట్ జరుపుతున్నట్లు సమాచారం. మరి ఇదివరకే ప్రకటించినట్లుగా ఆర్ఆర్ఆర్ మూవీ అక్టోబర్ 13న రిలీజ్ అయ్యే వాతావరణం కనిపించడం లేదు. చూడాలి మరి ఎప్పుడు తెరమీదకు రాబోతుందో.. ప్రస్తుతం సాంగ్ షూట్ కోసమైతే అలియా హైదరాబాద్ రావాల్సి ఉంది.
Tags:    
  • Alia Bhatt 
  • RRR Sita Look 
  • Alia Bhatt Sita Look 
  • Tollywood 
  • Telugu News 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS