లవ్వర్ ప్రెగ్నెన్సీపై డౌట్ తో డీఎన్ఏ టెస్టు చేయించిన హాలీవుడ్ ప్రముఖుడు

Update: 2023-06-03 10:03 GMT
అతడి వయసు 83 ఏళ్లు. అయితేనేం అతనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే అతను సాదాసీదా వ్యక్తి కాదు. ప్రముఖ హాలీవుడ్ స్టార్.. గాడ్ ఫాదర్ ఫేమ్ అల్ పాసినో. రెండు.. మూడు రోజుల క్రితం వరకు అతను ఒక్కసారిగా వార్తల్లోకి రావటం తెలిసిందే. దీనికి కారణం.. 83 ఏళ్ల వయసులో తనకంటే  చిన్నదైన ప్రేయసితో సహజీవనం చేయటం.. ఆమె గర్భవతి కావటం తెలిసిందే.

దీంతో.. వీరి ఉదంతం ఒక్కసారి వార్తాంశంగా మారింది. 83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో ఉదంతం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ వ్యవహారం వెనుక చేదు నిజం ఒకటి బయటకు వచ్చింది. తన ప్రేయసి గర్భవతి అన్నంతనే అతగాడికి డౌట్ వచ్చేసిందట. తానీ వయసులో పిల్లల్ని పుట్టించే సామర్థ్యం తనకు ఉందా? అన్న సందేహంతో ఆమెను డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని అడిగాడట. అతగాడి ఒత్తిడితో.. ఆమె ఓకే చెప్పిందట.

చివరకు పరీక్ష ఫలితం రావటం.. ఆ బిడ్డకు తానే తండ్రినన్న విషయాన్ని తెలుసుకున్న అతడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తాజా పరిణామంతో అతను నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నారు. అయితే.. అతడి లవ్వర్ నూర్ అల్ఫల్లా మాత్రం తొలిసారి ప్రెగ్నెంట్ కావటం గమనార్హం. గతంలో అతడను ముగ్గురితో కలిసి ఉన్నాడు. నూర్ విషయానికి వస్తే.. ఆమె గతంలో సింగర్ మిక్ జాగర్ తో డేటింగ్ చేసింది. 2018లో వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఎంత హాలీవుడ్ ప్రముఖుడు అయితే మాత్రం.. తన ప్రేయసి ప్రెగ్నెంట్ మీద సందేహాన్ని వ్యక్తం చేసి.. డీఎన్ఏ పరీక్ష కోసం పట్టుబడినప్పుడు లాగి పెట్టి ఒక్కటి ఇవ్వాలే కానీ.. సరేనని.. తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందా? అన్న ఆగ్రహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Similar News