• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘రామసేతు’ అక్షయ్...

‘రామసేతు’ అక్షయ్ కొత్తసినిమా.. ఫస్ట్​లుక్​తోనే భారీ అంచనాలు..

By - Tupaki Desk
Update: 2020-11-14 12:30 GMT
బాలీవుడ్​లో ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​ అయిన అక్షయ్​కుమార్​ తన తర్వాత సినిమాను ప్రకటించేశాడు. లాక్​డౌన్​ సమయంలోనూ సోషల్​మీడియాలో ఎంతో ఉత్సాహంగా కనిపించిన అక్షయ్​ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు కామెడీ పండించడంలోనూ అక్షయ్​ ముందుంటారు. ఇటీవల విడుదలైన ‘లక్ష్మీబాంబ్​’ చిత్రం ఇటీవలే ఓటీటీ ఫ్లాట్​ఫాం డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో రిలీజైంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్​గా నటించారు. ఈ సినిమాకు క్రిటిక్స్​ నెగెటివ్​ రివ్యూలు రాశారు. కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి స్పందనే వచ్చింది. దక్షిణాదిన భారీ విజయం సాధించిన కాంచన చిత్రానికి ఇది రీమేక్​. రాఘవ లారెన్స్​ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాతృకలో ఆయనే ప్రధానపాత్ర పోషించారు.

అక్షయ్​ జయపజయాలతో సంబంధం లేకుండా కొత్త చిత్రాలను ప్రకటిస్తుంటాడు. తాజాగా దీపావళి సందర్భంగా నూతన చిత్రం ‘రామసేతు’ ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ పోస్టర్​ను కూడా విడుదల చేశాడు. ‘ ఈ దీపావళి అందరికీ సంతోషాలను ఇవ్వాలి. మన మధ్య ఉన్న అంతరాలను అడ్డుగోడలను చెరిపివేయాలి. శ్రీరాముడు ఆదర్శాలను మనమంతా పాటిస్తూ ఆదర్శవంతంగా ముందుకుసాగుదాం. రాముడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సినిమా ద్వారా ముందుకు తీసుకెళదాం. అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు’ అంటూ అక్షయ్​ ట్వీట్​ చేశారు. ఈ సినిమాలో అక్షయ్​ లుక్​ డిఫరెంట్​గా ఉంది. కార్గో ట్రౌజర్​, లాంగ్​ స్లీవ్స్​ ఉన్నాయి. పొడవాటి జుట్టుతో కనిపిస్తున్నాడు. అభిషేక్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
Tags:    
  • Akshay Kumar 
  • New Movie 
  • Ram Setu 
  • First Look Poster 
  • Abhishek Sharma 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS