• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'OMG 2' ఫస్ట్ లుక్:...

'OMG 2' ఫస్ట్ లుక్: శివుడి అవతారంలో అక్షయ్ కుమార్..!

By - Tupaki Desk
Update: 2021-10-23 12:03 GMT
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూకుడు చూపిస్తున్నారు. ఇటీవల 'బెల్ బాటమ్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అక్షయ్.. ప్రస్తుతం ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నారు. 'సూర్యవంశీ' 'అత్రాంగి రే' 'పృథ్వీరాజ్' 'రక్షా బంధన్' 'రామ్ సేతు' 'మిషన్ సిండ్రెల్లా' 'గూర్ఖా' వంటి సినిమాలు యాక్షన్ హీరో ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మరో కొత్త సినిమా వచ్చి చేరింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ''OMG 2'' (ఓ మై గాడ్ 2) అనే సినిమాని ఈరోజు అధికారికంగా ప్రకటించారు.

అక్షయ్ కుమార్ - పరేశ్ రావెల్ ప్రధాన పాత్రల్లో 2012లో విడుదలైన 'ఓ మై గాడ్' (OMG) సినిమా మంచి విజయం సాధించింది. ఈ మూవీ పలు భారతీయ భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో వెంకటేష్ - పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో ‘గోపాల గోపాల’ అనే పేరుతో తెరకెక్కింది. అయితే ఇప్పుడు హిందీలో దీనికి సీక్వెల్ గా ''ఓ మై గాడ్ 2'' సినిమా చేస్తున్నారు అక్షయ్. శనివారం ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

'ఓఎంజీ 2' చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ లో ఓ స్కూల్ పిల్లాడిని కూడా చూడొచ్చు. ‘ఓఎంజీ’ లో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్.. సీక్వెల్ లో మాత్రం శివుడి అవతారంలోకి మారిపోయాడు. ఫస్ట్ పార్ట్ లో ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అనే వినూత్న కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు చూపించారు. ఇప్పుడు రెండో భాగంలో ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూని చూపించబోతున్నట్లు అక్షయ్ తెలిపారు. ట్తమ హానెస్ట్ హంబుల్ ప్రయత్నానికి అందరి ఆశీర్వాదాలు, ఆదరణ కావాలని కోరాడు. 'ఈ జర్నీలో అందరినీ ఆ ఆదియోగి ఆశీర్వదిస్తాడు. హర హర మహదేవ్' అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.

'OMG 2' చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. అమలెందు చౌదరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అక్షయ్ కుమార్ కు చెందిన కేఫ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ మరియు వకూ ఫిలిమ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


Tags:    
  • Akshay Kumar 
  • OMG 2 
  • First Look 
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS