అక్ష‌య్ ‘బెల్ బాటమ్’ స్టిచింగ్ కంప్లీటెడ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Update: 2021-02-20 03:30 GMT
బాలీవుడ్ లో ప్ర‌స్తుతం ‘అక్షయ్ కుమార్’ హ‌వా న‌డుస్తోంద‌ని చెప్పొచ్చు. శరవేగంగా సినిమాలు తీసే హీరోలను లిస్ట్ ఔట్ చేస్తే.. అక్షయ్ ఫ‌స్ట్ రోలోనే క‌నిపిస్తాడు. ఇప్పుడు అక్షయ్ కిట్ లో ఒక‌టీ రెండు కాదు.. ఏకంగా ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి!

బెల్ బాటమ్, పృథ్వీరాజ్, అట్రాంగి రే, బచ్చన్ పాండే, ఇంకా ‘రామ్ సేతు’ ఈ ఐదు సినిమాల‌ను 2022లోపు ఫినిష్ చేసి, రిలీజ్ చేయాల‌న్న‌ది అక్ష‌య్ టార్గెట్‌. క‌రోనా వ‌చ్చి ఇబ్బంది పెట్టింది కానీ.. ఇందులో స‌గం సినిమాలు ఈపాటికే వ‌చ్చేయాల్సిన‌వి. అయిన‌ప్ప‌టికీ.. వేగం మాత్రం త‌గ్గించ‌ట్లేదీ బాలీవుడ్ హీరో.

త‌న అప్ క‌మింగ్ ఐదు సినిమాల్లోంచి.. బెల్ బాటమ్ రానే వ‌చ్చేస్తోంది‌. ఇండియాలో క‌రోనా ప్ర‌తాపం చూపిస్తున్న రోజుల్లోనే స్కాట్లాండ్ షిఫ్ట్ అయిన యూనిట్‌.. షూటింగ్ య‌మా ఫాస్ట్ గా ఫినిష్ చేసింది. గ‌త అక్టోబ‌ర్ లోనే ఈ మూవీ చిత్రీక‌ర‌ణ‌ ముగించారు. ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్ధ‌మైంది.

అయితే.. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన స‌మ‌యంలో క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌డంతో.. ఈ చిత్రం ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ప్రముఖ ప్లాట్‌ఫామ్ లు ఈ మూవీని సొంతం చేసుకునేందుకు సిద్ధ‌ప‌డ్డాయి. అయితే.. ఆ ఊహాగానాల‌కు తెర‌దించుతూ.. బెల్ బాట‌మ్ ను థియేట‌ర్ లోనే రిలీజ్ చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

స‌మ్మ‌ర్ సీజ‌న్ లో బెల్ బాట‌మ్ ను షెడ్యూల్ చేశారు నిర్మాత‌లు. మే 28న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రంజిత్ తివారీ తెర‌కెక్కిస్తున్నారు. వాణికపూర్, హుమా ఖురేషి, లారా దత్తా కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.
Tags:    

Similar News