వరద బాధితులకు అక్కినేని నాగార్జున భారీ విరాళం

Update: 2020-10-20 11:10 GMT
హైదరాబాద్‌ లో కురిసిన భారీ వర్షాలకు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మంగళవారం సైతం భారీ వర్షం కురువడంతో నష్టం మరింతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తమిళనాడు సీఎం 10 కోట్లు ప్రకటించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాజాగా రూ.15 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం రూ. 550 కోట్లు విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం బోట్లు, ఇతర నిత్యావసరాలు అందించేందుకు ముందుకొచ్చింది. ఇక వరద బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు స్పందించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

దీంతో రాష్ట్రంలోని సినీ, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్‌ పరిస్థితిని చూసి చలించిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర హీరో  అక్కినేని నాగార్జున హైదరాబాద్ వరద బాధితుల కోసం రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

కేసీఆర్ పిలుపుతో చాలా మంది వ్యాపార, వాణిజ్య, సినీ ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తో ఆర్థికంగా సర్కార్ కుదేలైన వేళ హైదరాబాద్ కష్టాలు తీర్చేందుకు ఇస్తున్న సాయం బాధితులకు తోడ్పాటునందిస్తోంది.

ఇప్పటికే సీఎం కేసీఆర్ నష్టపోయిన బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం ప్రకటించారు. ఇళ్లు కూలిపోతే లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు ఇస్తున్నారు.
Tags:    

Similar News