మాల్దీవుల్లో అక్కినేని క‌పుల్ కాస్ట్ లీ షాపింగ్.. ఏం కొన్నారేంటి?

Update: 2020-12-01 11:30 GMT
జీవితంలో ఎన్నో మ‌జిలీలు. ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డ మ‌జిలీని ప్రారంభించి ఎలా ముగిస్తారో చెప్ప‌లేం. చెన్న‌య్ చంద్రం స‌మంత‌తో అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌కు ఎలా ముడిప‌డిందో ఆ జంట ల‌వ్ మ‌జిలీ సంగ‌తేమిటో అంద‌రికీ తెలిసిన‌దే. ఏమాయ చేశావే సెట్స్ లో ప్రేమ ముడిప‌డింది. ఆ త‌ర్వాత దాని గుట్టు విప్ప‌డానికే ఏడెనిమిదేళ్లు ప‌ట్టింది. ఒక‌సారి ప్రేమ‌ను క‌న్ఫామ్ చేసుకున్నాక మాత్రం ఇక ఆ జంట అస్స‌లు ఒక‌రిని విడిచి ఒక‌రు లేరు. ఇంట్లో పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లాడేశారు.

అన్న‌ట్టు అక్కినేని నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట గ‌త వారం రోజులుగా మాల్దీవుల్లో విహ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్కడ బ్లూ వాట‌ర్స్ లో బికినీ బీచ్ లో సెల‌బ్రేష‌న్ ఓ రేంజులోనే సాగించింది ఈ జంట‌. ఎట్ట‌కేల‌కు ఒంట‌రి దీవుల్లో విహారాన్ని ముగించి తిరిగి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో కి వచ్చేస్తున్నార‌ని ఈ ఎయిర్ పోర్ట్ లుక్ చెబుతోంది.

స‌మంత అక్కినేని తాజా ఎయిర్ పోర్ట్ లుక్ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. సామ్ ధ‌రించిన‌ జంగిల్ ప్రింట్ షార్ట్.. ఆ డెనిమ్ టాప్ చాలా కాస్ట్ లీ అని యూత్ ము‌చ్చ‌టించుకుంటోంది. సమంత‌ అక్కినేని ఖ‌రీదైన‌ వివిధ బ్రాండెడ్ వ‌స్తువుల్ని.. విలాసవంతమైన ఐకానిక్ బ్యాగ్స్ తో క‌నిపించి షాకిస్తున్నారు.  చూస్తుంటే మాల్దీవుల నుంచి వ‌చ్చేప్పుడు భారీగా ఈ క‌పుల్ షాపింగ్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. సమంతా అక్కినేని విమానాశ్రయం ఖరీదైన బ్యాగ్ ఫోటోలు వైర‌ల్ గా మారాయి ఇప్పుడు.

పాలెజ్జో వెర్సాస్ హోట‌ల్ మాల్దీవుల్లో చాలా ఫేమ‌స్. అలాగే వెర్సాస్ షాపింగ్ మాల్ అంతే ఫేమ‌స్. అక్క‌డి నుండి ఈ హాట్ క‌పుల్ కొత్త టోట్ బ్యాగ్ తో బ‌య‌ట‌ప‌డం అంద‌రి దృష్టిని ఆకర్షించింది. సమంతా అక్కినేని విమానాశ్రయంలో అక్క‌డ షాపింగ్ చేసిన డ్రెస్ లోనే క‌నిపించార‌ని గెస్ చేస్తున్నారు అభిమానులు. ఆ నీలం ఆకుపచ్చ జంగిల్ ప్రింట్ వెర్సాస్ టోటే విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుంద‌ని అంచ‌నా.

స‌మంతా అక్కినేని ట్రావెల్ వార్డ్రోబ్ ట్రెండీ టాక్ గా మారింది. సమంతా అక్కినేని తనదైన సెల‌క్ష‌న్ తో అభిమానుల‌ హృదయాలను గెలుచుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఈసారి కూడా అంతే మ‌న‌సు దోచారు.

కెరీర్ సంగ‌తి చూస్తే.. సమంతా అక్కినేని తన చాట్ షో సామ్ జామ్ షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తారు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకులా రేండు కదల్ కిక్ స్టార్ట్ అవుతుంద‌ట‌. ఇందులో నయనతార -విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ తొలి హిందీ వెబ్ తొలి చిత్రం ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 విడుదల కావాల్సి ఉంది.
Tags:    

Similar News