మిడిల్ క్లాస్ బాయ్ గా అఖిల్?

Update: 2019-07-18 04:27 GMT
మూడేళ్ళ కెరీర్ లో మూడు పరాజయాలతో మొదటి హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ నాలుగో సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఫామ్ లో లేని బొమ్మరిల్లు భాస్కర్ ని దర్శకుడిగా ఎంచుకోవడం చూసి మొదట అందరూ ఆశ్చర్యపోయినా గీత ఆర్ట్స్ నిర్మాణం కాబట్టి కంటెంట్ ఉంటేనే ఇది పాస్ అయ్యుంటుందన్న నమ్మకం ఫాన్స్ లో ఉంది. ఇకపోతే దీంట్లో అఖిల్ చేస్తున్న పాత్ర తాలూకు చిన్న అప్ డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం ఇందులో అఖిల్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తాడట. మరీ కష్టాలున్న ఫామిలీ టైపు లో కాకుండా కాస్త బెటర్ గా అనిపించే కుటుంబంలో అందరితో కలివిడిగా ఉండే పాత్ర డిజైన్ చేసినట్టు టాక్. భాస్కర్ మధ్య తరగతి ఎమోషన్స్ ని బాగా ప్రెజెంట్ చేస్తాడు. బొమ్మరిల్లులో హీరో ధనవంతుడైనా హీరోయిన్ ఫ్యామిలీని జస్ట్ యావరేజ్ మిడిల్ క్లాస్ గా తీర్చిద్దిద్ధి నాన్న కూతురి భావోద్వేగాలను చూపించిన తీరు ఆకట్టుకుంది

అదే తరహాలో ఇప్పుడీ ఫార్ములా హీరో ఫామిలీకి ఆపాదించాడట భాస్కర్. అఖిల్ ఇప్పటిదాకా చేసిన మూడు సినిమాల్లో రిచ్ కిడ్ గానే కనిపించాడు. ఒకరకంగా కామన్ ఆడియన్స్ కి అఖిల్ కనెక్ట్ కాకపోవడంలో ఇది కూడా కారణం కాబోలు. అందుకే ఇప్పుడీ కథ ఫామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని భాస్కర్ రూపొందించినట్టు తెలిసింది. కూకట్ పల్లిలో జరుగుతున్న షూట్ లో ప్రస్తుతం వీటి తాలూకు సన్నివేశాలనే షూట్ చేస్తున్నారు. హీరోయిన్ ఎవరో ఇంకొద్ది రోజుల్లో డిసైడ్ చేసి తనను రెండో షెడ్యూల్ నుంచి ఎంట్రీ ఇప్పిస్తారు. ఎవరు అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.


Tags:    

Similar News