సమంత కోసం ప్రార్థన చేసిన ఇద్దరు అక్కినేని హీరోలు

Update: 2022-10-30 10:48 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నాను అని.. త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అన్నట్లుగా సమంత సోషల్‌ మీడియా ద్వారా అన్ని విషయాలను వెల్లడించిన విషయం తెల్సిందే.

సమంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చాలా మంది ఫిల్మ్‌ స్టార్స్ ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమె త్వరగా పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు.

నాగ చైతన్య నుండి విడి పోయిన కారణంగా అక్కినేని ఫ్యాన్స్ నుండి ఈమెకు గెట్‌ వెల్‌ సూన్‌ విష్ లు దక్కుతాయా అంటూ అంతా ఆసక్తిగా చూశారు. మొదట అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుశాంత్‌ స్పందిస్తూ సమంత త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటూ గెట్‌ వెల్‌ సూన్ చెప్పాడు.

ఆ తర్వాత అక్కినేని మరో హీరో అఖిల్‌ కూడా సమంత ఇన్ స్టా పోస్ట్‌ కు కామెంట్‌ పెట్టాడు. అఖిల్‌ స్పందిస్తూ డియర్ సామ్‌ అందరి ప్రేమ మరియు బలం నీకు అందుతుంది అంటూ గెట్‌ వెల్‌ సూన్ మెసేజ్ ను పెట్టడం జరిగింది. అఖిల్‌ కామెంట్‌ ఇన్ స్టా లో వైరల్‌ అయ్యింది.

అంతే కాకుండా ఎన్టీఆర్‌.. చిరంజీవి.. మంచు లక్ష్మి తో పాటు పదుల సంఖ్య లో సెలబ్రెటీలు సమంత యొక్క ఆరోగ్యం వెంటనే కుదుట పడాలని ప్రార్థిస్తున్నాం అంటూ పేర్కొన్నారు. సమంత యశోద సినిమా నవంబర్‌ 11న విడుదల కాబోతుంది. అప్పటి వరకు సమంత కోలుకోవాలని మనమూ కోరుకుందాం.
Tags:    

Similar News