ఏడేళ్ల తర్వాత కలుస్తున్న బాలీవుడ్ కపుల్

Update: 2017-08-24 09:10 GMT
బాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లిస్ట్ తీస్తే.. అందులో అజయ్ దేవగన్-కాజోల్ కూడా కచ్చితంగా ఉంటారు. అలాంటి ఈ జంట ఆన్ స్క్రీన్ పై కలిసి కనిపించిన సినిమాలు మాత్రం కాసింత తక్కువగానే ఉంటాయి. ఇక పెళ్లయిన తర్వాత అయితే.. మరీ పిసినారితనం పాటించేశారు. ఇద్దరూ కలిసి యాడ్స్ లో బాగానే సందడి చేశారు కానీ.. సినిమాల విషయంలో మాత్రం బాగా పొదుపు పాటించేశారు.

1999లో పెళ్లి చేసుకున్న అజయ్ దేవగన్- కాజోల్.. ఆ తర్వాత యాడ్స్ లో అయితే కలిసి తెగ కనిపించేశారు కానీ.. సినిమాల్లో జంటగా కనిపించిన సందర్భాలు మూడే. 18 ఏళ్ల సమయంలో టాప్ హీరో- టాప్ హీరోయిన్ జాబితాలో ఉండే జంట ఇలా మూడే సినిమాల్లో నటించారంటే ఆశ్చర్యకరమైన విషయమే. చివరగా 2010లో తూన్ పూర్ కా సూపర్ హీరో చిత్రంలో కలిసి నటించిన అజయ్- కాజోల్.. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు కలవబోతున్నారు. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ మూవీ కోసం వీరిద్దరూ జట్టు కడుతున్నారనే విషయం ఖాయమైంది. లైఫ్-ఎఫైర్ థీమ్ తో రూపొందనున్న ఈచిత్రంలో.. ఈ రియల్ లైఫ్ కపుల్ కెమిస్ట్రీనే ప్రధాన ఆకర్షణ అన్నది బాలీవుడ్ టాక్.

నిజానికి ఈ మూవీని యాడ్ ఫిలిం మేకర్ రాజ్ సారథి దర్శకత్వంలో రూపొందించాల్సి ఉంది. కానీ అతనితో హీరోకు అంతగా పొసగలేదు. దీంతో ప్రదీప్ చేతికి పగ్గాలు అప్పగించగా.. ఈ దర్శకుడు చేసిన కీలక మార్పుల్లో భాగంగా.. సినిమాలోకి కాజోల్ ఎంట్రీ ఇచ్చింది. అలా ఏడేళ్ల తర్వాత రియల్ లైఫ్ కపుల్.. సినిమాలో రొమాన్స్ కు మళ్లీ సిద్ధమవుతున్నారు.
Tags:    

Similar News