ఫొటోటాక్‌ః అమ్మ బర్త్ డే లో ఐశ్వర్య రాయ్ ఫ్యామిలీ
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సౌత్ సినీ అభిమానులను కూడా రెండు దశాబ్దాలకు పైగా తన అందంతో అభినయంతో ఆకట్టుకుంటున్న అందగత్తె ఐశ్వర్య రాయ్. పెళ్లి అయ్యి పుష్కర కాలం దాటినా.. పదేళ్ల కూతురు ఉన్నా కూడా ఇంకా హీరోయిన్ గా ఆమె తన స్టార్ డంను కొనసాగిస్తుంది అంటే ఆమె అందం ఏంటో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ సెలబ్రెటీల్లో కొందరు వివాహ బంధంకు గౌరవం ఇవ్వకుండా తమ స్టార్ స్టేటస్ అంటూ పెళ్లి చేసుకున్నా విడిపోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఐశ్వర్యరాయ్ మాత్రం తన భర్తతో పాటు అత్తా మామలతో చాలా మంచి సన్నిహిత సంబంధంను కలిగి ఉంటారని టాక్. ఇక తన తల్లి తో ఐశ్వర్య కు చాలా సన్నిహిత్యం ఉంటుంది.
తల్లిపై సందర్బానుసారంగా ప్రత్యేకమైన అభిమానం ప్రేమను చూపిస్తూ ఉంటుంది. అమ్మ బర్త్ డే సందర్బంగా తాజాగా ఆమె సెలబ్రేట్ చేసింది. కూతురు ఆధ్య మరియు భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి తల్లికి పుట్టిన రోజున ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సర్ ప్రైజింగ్ గిప్ట్ లతో తల్లిని ఆనందింపజేసింది. ఆమె కళ్లలో ఆనందంను చూడవచ్చు. ఐశ్వర్య రాయ్ పోస్ట్ చేసిన ఈ పిక్చర్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమ్మమ్మతో ఆద్య దిగిన ఫొటో మరియు ఫ్యామిలీ మొత్తం దిగిన ఫొటో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ అందమైన ఫ్యామిలీ అంటూ కామెంట్స్ ను దక్కించుకుంటుంది.