ఐశ్వర్య తండ్రికి తీవ్ర అనారోగ్యం

Update: 2017-03-10 04:43 GMT
బాలీవుడ్ బ్యూటీ.. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ ను కన్న తండ్రి కృష్ణ రాజ్. ఈయన గత రెండు వారాలుగా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇప్పుడీయన పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. ఐష్ ఇంటిల్లిపాదీ ఇప్పుడు తీవ్ర ఆందోళనలో నిండిపోయారు.

కృష్ణ రాజ్ గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి చికిత్స కూడా తీసుకుంటున్నా.. ప్రస్తుతం పరిస్థితి చెయ్యి దాటిపోయిందని తెలుస్తోంది. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో రెండు వారాలుగా ఉన్న ఈయన ఆరోగ్యం పూర్తిగా విషమించిందట. దీంతో న్యూయార్క్ లో ఉన్న అల్లుడు అభిషేక్ బచ్చన్.. హుటాహుటిన ముంబై తరలివచ్చాడు. అభి-ఐష్ లు ఇద్దరూ ఆయనను పరామర్శించారు. వైద్యులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

ఇటు కూతురు బాగోగులు చూసుకుంటూనే.. అటు తండ్రికి సపర్యలు చేస్తోంది ఐశ్వర్య. ఎప్పటికప్పుడు వైద్యులను అప్రమత్తం చేస్తూ తండ్రి ప్రాణాలను కాపాడుకుంటోందని తెలుస్తోంది. అయితే.. కృష్ణరాజ్ ఆరోగ్యం బాగా విషమించిందని చెబుతున్నారు వైద్యులు. తాను కెరీర్ లో ఎదగడానికి ఎంతగానే మద్దతు పలికి.. అండగా నిలిచిన తండ్రి అంటే.. ఐశ్వర్యారాయ్ కు ప్రాణం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News