ఆహా(నా) కుమ్రా.. ఏమిటీ అందం..!

Update: 2021-02-08 13:33 GMT
అహానా కుమ్రా.. ఈ న‌టి తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేదు. కానీ.. బాలీవుడ్ లో మాత్రం ఫేమ‌స్ ప‌ర్స‌నాలిటీనే! స్టేజ్ షోలు మొద‌లు.. టీవీలో, సినిమాలు అంటూ ఏ రంగాన్నీ వ‌దిలిపెట్ట‌లేదీ అమ్మ‌డు. అయితే.. ఈ లక్నో బ్యూటీ తాజాగా ద‌క్షిణాది ఇండ‌స్ట్రీపై క‌న్నేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

దాదాపు ప‌న్నెండేళ్ల క్రితం తెరంగేట్రం చేసిందీ బాలీవుడ్ బ్యూటీ. 2009లో ఒక చిన్న చిత్రంతో స్మాల్ స్క్రీన్ ఇండ‌స్ట్రీలోకి ప్రవేశించింది కుమ్రా. ఆ త‌ర్వాత వెండి తెర‌పై క‌నిపించిన ఈ బ్యూటీ దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఇక‌, స్టేజ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు మాత్రం లెక్క‌కు మించి ఇచ్చింది.

ప్రస్తుతం కుమ్రా.. హిందీలో ‘షంషెరా’ చిత్రంతోపాటు ‘ఇండియా లాక్‌డౌన్’ సినిమాతో బిజీగా ఉంది. కాగా.. ZEE5 ఒరిజినల్స్‌లో కూడా కనిపించిందీ అమ్మడు. ‘యువర్స్ ట్రూలీ’ పేరుతో ఈ చిత్రం రూపొందింది.

అయితే.. ఈ అమ్మడు ఫొటోలు ఇప్పుడు సౌత్ ఫిల్మ్ సర్కిల్స్‌లో రౌండ్లమీద రౌండ్లు వేస్తున్నాయి. కుమ్రా న‌ట‌న గురించి తెలిసిన వారు.. ఆమె టాలెంట్ గురించి ఫుల్లుగా పొగిడేస్తున్నార‌ట‌. దీంతో.. దక్షిణాది చిత్రాల్లోకి ఈమె ఎంట్రీ ఖాయమని అంటున్నారు.

కాగా.. ఆమె లేటెస్ట్ ఫొటో ఒకటి ఆన్ లైన్లో చక్కర్లు కొడుతోంది. రెడ్ గౌను ధరించిన కుమ్రా.. ఈ డ్రెస్ లో ఫుల్లుగా మెరిసిపోతోంది. టాప్ టూ బాటమ్ ఎర్రగా యాపిల్ పండులా కనిపిస్తూ.. చూపరుల హృదయాలను కొల్లగొడుతోంది. చూడాలి మరి.. సౌత్ లో ఏ ఇండస్ట్రీలో పాదం మోపుతుందో?
Tags:    

Similar News