అజ్ఞాతవాసి ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Update: 2018-01-17 09:40 GMT
పవన్ సినిమా అంటేనే అంత. ఎంత డిజాస్టర్ టాక్ వచ్చినా ఏదో ఒక రికార్డు తన ఖాతాలో వేసుకోనిదే బాక్స్ ఆఫీస్ నుంచి వెళ్ళదు. అజ్ఞాతవాసి కూడా అదే దారిలో ఉంది. సంక్రాంతి సందడి ఒక కొలిక్కి రావడంతో ఇకపై వసూళ్లు ఆశించడం అత్యాశే. మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ కావడంతో ఎక్కడా కోలుకునే అవకాశం దక్కలేదు. వెంకీ సీన్లు జత చేయటం వల్ల కూడా ఒరిగింది ఏమి లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంత డిజాస్టర్ స్టాంప్ వేయించుకున్నా అజ్ఞాతవాసి కొన్ని రికార్డులు సాధించడం విశేషం. నిన్నటితో ఫస్ట్ వీక్ రన్ పూర్తి చెసుకున్న అజ్ఞాతవాసి కలెక్షన్స్ రోజురోజుకి తగ్గడమే తప్ప ఎక్కడా పెరిగే సూచనలు కనిపించడం లేదు. మరి ఇప్పటి దాకా వచ్చిన వసూళ్ళ లెక్కలు ఎంతున్నాయో చూద్దాం.

                             గ్రాస్              షేర్

                             (కోట్లలో)         (కోట్లలో)

వైజాగ్                      5.21            

ఈస్ట్                        3.82

వెస్ట్                        4.47

కృష్ణా                       3.08

గుంటూర్                  5.01

నెల్లూరు                   2.16

ఆంధ్ర                       23.75          35.1
4

సీడెడ్                       5.10             7.5

నైజాం                      10.30           17.1

తెలుగు రాష్ట్రాలు         39.15           59.7

(మొత్తం)

యుఎస్                   7.10             12.9

కర్ణాటక                    6.25             10.5

మిగిలిన చోట్లు            2.45             5.6

ప్రపంచవ్యాప్తంగా        54.95            88.7


విడుదలకు ముందు థియేట్రికల్ రైట్స్ 125 కోట్లకు దాకా బిజినెస్ జరిగింది. ఆ లెక్కలో చూసుకుంటే షేర్ రూపంలో ఇప్పటి దాకా సగం కూడా రాలేదు. ఇంత భారీ గ్రాస్ రావడానికి కారణం కూడా ఆంధ్రలో అధిక టికెట్ రేట్లు, అదనపు షోలు విపరీతంగా వేయటం, మొదటి రోజు కనివిని ఎరుగని రీతిలో దాదాపు అన్ని థియేటర్స్ లో అజ్ఞాతవాసి ప్రదర్శించడం కారణాలుగా చెప్పొచ్చు. ఇంకో పది రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా లేదు కాబట్టి అది పూర్తయ్యాక నష్టాల గురించి క్లారిటీ వస్తుంది

ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం అధిక షేర్లు రాబట్టిన సినిమాల్లో అజ్ఞాతవాసి తొమ్మిదో స్థానం దక్కించుకోవడం విశేషం. అత్తారింటికి దారేది 47.27 కోట్లతో పదో స్థానంలో ఉండగా మంచి మార్జిన్ తో అజ్ఞాతవాసి దాన్ని దాటేసాడు. ఇక పవన్ సినిమాలు విడిగా తీసుకుంటే కాటమరాయుడు తర్వాత అధిక షేర్స్ సాధించిన మూవీగా కూడా మరో రికార్డు ఇందులో చేరింది. కాటమరాయుడు 55.25 కోట్ల ఫస్ట్ వీక్ షేర్ ఇప్పటికీ పవన్ కెరీర్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఫ్లాప్ అయితేనే ఇలా ఉంది. ఒకవేళ హిట్ అయ్యుంటే ఈ లెక్కలకు రెక్కలు వచ్చేవి.  బ్యాడ్ లక్ పవన్.

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!
Tags:    

Similar News