తేనెకళ్ల పిల్లకు హిట్టు పడేనా?
అదితీరావు హైదరి అనే పేరు వినగానే పొన్నాగిపువ్వు లాంటి అమ్మాయి కళ్లముందు కదలాడుతుంది. నందివర్ధనాలన్నీ కలిపి చేసినట్టుగా నాజూకుగా కనిపిస్తుంది. తేనెరంగు కళ్లతో .. గులాబీ రేకులకు సవాలు విసిరే పెదాలతో అందంగా మెరుస్తుంది. పాలు - పంచదార కలిపి చేసినట్టుగా అనిపించే లావణ్యంతో సమ్మోహితులను చేస్తుంది. మంచుకురిసే మందార వనాల్లో ఈ అమ్మాయిని కనుక్కోవడం కష్టం అనేంత మేనిఛాయతో ఆశ్చర్యచకితులను చేస్తుంది. అలాంటి అదితీరావుకు అభిమానులు బాగానే ఉన్నారు.
అదితీరావు కెరియర్ ను పరిశీలిస్తే .. ఈ పొడుగు కాళ్ల సుందరి హిందీలో ఎక్కువ సినిమాలు చేసిందనే విషయం అర్థమవుతుంది. అడపాదడపా తమిళ .. మలయాళ .. తెలుగు సినిమాల్లో మెరిసింది. 'సమ్మోహనం' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఈ అమ్మాయి, తొలి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించింది. దాంతో ఈ పిల్ల ఇక్కడ వరుస సినిమాలు చేయడం ఖాయమని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. అందుకు కారణం ఆ తరువాత అదితీరావు చేసిన 'అంతరిక్షం' .. 'వి' సినిమాలు అంతగా ఆడకపోవడమే.
ప్రస్తుతం ఈ అమ్మాయి అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం చేస్తోంది. 'ఆర్ ఎక్స్ 100' వంటి రొమాంటిక్ మూవీతో హిట్ కొట్టిన అజయ్ భూపతి, ఆ తరువాత సినిమాగా 'మహాసముద్రం' రూపొందిస్తున్నాడు. శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఒక కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, మరో కథానాయికగా అదితీరావును తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఆగస్టు 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో అదితీరావు ఇక్కడ నిలదొక్కుకుంటుందేమో చూడాలి.