• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒక్క ఛాన్స్.. దశ...

ఒక్క ఛాన్స్.. దశ తిరిగిపోతుందేమో!

By - Tupaki Desk
Update: 2016-11-15 09:45 GMT
ఒక మనీషా కొయిరాలా.. ఒక ఐశ్వర్యారాయ్.. ఒక నిత్యా మీనన్.. ఇలా ఎంతెంతమంది హీరోయిన్లు మణిరత్నం సినిమాలతో మెరిసిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటిదాకా ఎలాంటి సినిమాలు చేశారన్నది ముఖ్యం కాదు. మణిరత్నంతో సినిమా చేస్తే వాళ్ల రేంజే మారిపోతుంది. ఆయన సినిమాలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఏ హీరోయిన్ అయినా. ఇప్పుడు బాలీవుడ్ భామ అదితి రావు హైదరి వంతొచ్చింది.

దాదాపు దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. ‘మర్డర్-3’ లాంటి సినిమాల్లో అందాలు ఆరబోసినా.. అదితికి ఇప్పటిదాకా బాలీవుడ్లో ఆశించిన బ్రేక్ రాలేదు. భర్త సత్యదీప్ మిశ్రా నుంచి విడాకులు తీసుకుని.. పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టిపెట్టినా ఆమె కెరీర్ గాడిన పడలేదు. ఐతే ఎట్టకేలకు ఆమెకు మణిరత్నం సినిమా ‘కాట్రు వేళయిదే’ రూపంలో ఒక బంపర్ ఆఫర్ తగిలింది.

ఇది తమిళ సినిమానే కావచ్చు. కానీ మణిరత్నం సినిమాలో చేస్తే వచ్చే గుర్తింపు అలాంటిలాంటిది కాదు. ఆయన సినిమాలపై బాలీవుడ్ జనాల కళ్లూ ఉంటాయి. బాలీవుడ్ సంగతలా వదిలేస్తే.. సౌత్ లో మంచి పేరొచ్చినా చాలు.. ఇక్కడ హీరోయిన్ల కొరత బాగా ఉంది కాబట్టి.. అవకాశాలు పట్టేయొచ్చు. మణిరత్నం సినిమాలో చేయడం అంటే ఆ స్థాయే వేరుగా ఉంటుంది. ఇందులో మెప్పిస్తే స్టార్ల సరసన అవకాశాలు ఆటోమేటిగ్గా తన్నుకుంటూ వచ్చేస్తాయి. మరి కాట్రువేళయిదే (తెలుగులో డ్యూయెట్) సినిమాతో అదితి ఎలాంటి ముద్ర వేస్తుందో వచ్చే మార్చిలో తేలిపోతుందిలెండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Aditi Rao Hydari 
  • Karthi 
  • Duet Movie 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS