ఆదిపురుష్ : రేపు ఉదయం 7.11 సూపర్ అప్డేట్‌

Update: 2022-09-29 13:19 GMT
ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు మరియు అభిమానులు ఎదురు చూస్తున్న ఆదిపురుష్‌ యొక్క టీజర్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 2వ తారీఖున టీజర్ విడుదల కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా అయితే క్లారిటీ రాలేదు. రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు అధికారికంగా టీజర్ ప్రకటన రాబోతుంది.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా ప్రకటన మొదలుకుని ప్రతి విషయాన్ని కూడా దర్శకుడు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు సమయం పెట్టుకుని మరీ విడుదల చేస్తున్నాడు. ఆ సమయం యొక్క ప్రాముఖ్యత ఏంటో కానీ మళ్లీ అదే సమయంకు రేపు టీజర్‌ అఫిషియల్‌ పోస్టర్ రాబోతుంది.

ఆదిపురుష్ టీజర్ గురించి ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయోధ్య లో యూపీ సీఎం యోగి ఆధిత్య నాథ్‌ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయోధ్య లో జరుగబోతున్న ఈవెంట్‌ లో ప్రభాస్ పాల్గొంటాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌ నటించగా.. సీత పాత్రలో కృతి సనన్ నటించింది. రావణాసురుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్ సైఫ్‌ అలీ ఖాన్‌ నటించాడు. ఇంకా ఎంతో మంది బాలీవుడ్‌ ప్రముఖులు ఈ సినిమాలో నటించారు. రూ. 500 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ రామాయణ ఇతివృత్తం మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News