గెటప్ మార్చి దూకుడు పెంచుతోంది

Update: 2018-01-17 08:30 GMT
కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే పరిస్థితి ఎలా మారిపోతుందనే విషయాన్ని.. టాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మను చూసి తెలుసుకోవచ్చు. ఆరంభంలో లభించిన క్రేజ్ ను సరిగా ఉపయోగించుకోకుండా.. చిన్నా చితకా పాత్రలను యాక్సెప్ట్ చేసి బోల్తా పడింది ఈ భామ.

క్షణం మూవీతో సూపర్బ్ పెర్ఫామెన్స్ చూపించి.. అందరి దృష్టిలో పడినా కెరీర్ మాత్రం ఇంకా గాడిలో పడలేదు. గతేడాది కమాండో2 అంటూ బాలీవుడ్ మూవీలో నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాతి సినిమాల సంగతి తేల్చలేదు. ఇప్పుడు హఠాత్తుగా కొత్త గెటప్ తో దర్శనం ఇచ్చింది ఆదాశర్మ. గభాలున చూస్తే ఎవరీ విదేశీ అందగత్తె అనుకునే రేంజ్ లో మారిపోయి కనిపిస్తోంది ఆదా. ఇటు ఫిజిక్ నుంచి అటు గెటప్ వరకు.. డ్రైసింగ్ నుంచి హెయిర్ స్టైల్ వరకు అన్ని యాంగిల్స్ లోను కొత్తగా ట్రై చేసింది. ఈ గెటప్ ఆమెకు అద్భుతంగా సెట్ అయిందనే చెప్పాలి. పైగా నడుం ఒంపులను వయ్యారంగా ఎగ్జిబిట్ చేస్తున్న డిజైనర్ డ్రెస్ మరీ ఆకట్టుకుంటోంది.

2018లో కొత్తగా కనిపించడమే కాదు.. దూకుడు చూపించబోతున్నా అంటే తనే చెప్పేస్తోంది ఆదా శర్మ. ఈ భామ చూపించబోయే దూకుడుకు ఈ ఫోటో శాంపిల్ అనుకోవచ్చు. అసలే అందగత్తె.. పైగా అందాల ఆరబోతకు అంతగా అబ్జెక్షన్స్ ఉండవు.. ఇప్పుడు కొత్త దూకుడు కూడా చూపించేస్తానంటోంది.. మరి అవకాశం ఇచ్చే మేకర్స్ ఎవరో తేలాలి అంతే!
Tags:    

Similar News