ఢిల్లీ నుంచి గళ్లీ వరకూ ఉండాలండీ గాళ్ఫ్రెండ్సు.. తేజ 'చిత్రం' సినిమాలోని పాట ఇది. ఉదయ్ కిరణ్ అండ్ గ్యాంగ్ వేసిన స్టెప్పులు ఇప్పటికీ యూత్ మర్చిపోలేరు. కానీ ఢిల్లీ నుంచి బోలెడుమంది భామలు టాలీవుడ్ గళ్లీలో అవకాశాల కోసం అడుగు పెడుతున్నారు.
తాప్సీ ఢిల్లీ భామ. కృతి సేనన్ కూడా అక్కడి నుండే. ఇప్పుడు ముంబయ్‌లో సెటిల్ అయ్యింది కాని, శ్రీయ కూడా అక్కడినుండే వచ్చింది. అంతకంటే ముందే మరో ముగ్గురు నలుగురు కౌర్‌లు ఢిల్లీ పరిసరాల నుంచే సినీపరిశ్రమలో లక్ చెక్ చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు లేటెస్టుగా మరో భామ టాలీవుడ్లో అడుగుపెట్టింది. కేరింత చిత్రంలో నటించి యువతరం మనసులు దోచిన ఈ అమ్మడి పేరు సుకృతి. రింగుల జుత్తు, అమాయకమైన మోము, ఆకట్టుకునే ఆహార్యం ఈ అమ్మడి ప్రత్యేకతలు.
డీసెంట్‌గా కనిపించి తెలుగువారి మనసు దోచిన ఈ అమ్మడు ప్రస్తుతం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. తండ్రి ఢిల్లీలో ఓ సివిల్ ఇంజినీర్. తల్లి గృహిణి. తాను సినిమాల్లోకి వెళతానంటే ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా దిల్‌రాజు కాస్టింగ్ పిలుపు గురించి తెలుసుకుని స్నేహితులంతా సుకృతిని తొందర పెట్టేశారు. అదే విషయం అన్నయ్యతో చెబితే మంచి బ్యానర్ ప్రొడీస్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా సుకృతి కేరింత చిత్రంలో నటించి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది.
''తెలుగు మాట్లాడడం కష్టం. అందుకే హిందీ వీడియోని కాస్టింగ్ కాల్‌సెంటర్‌కి పంపించా. అది చూసి ఆడిషన్స్ చేసి ఎంపిక చేసుకున్నారు. తెలుగు రాకపోయనా ఇక్కడి నుంచి వచ్చే అనువాదాల్ని హిందీలో చూస్తుంటాం'' అుని తెలిపింది.