అప్పుడే కోటి చేరిన లక్కీ బ్యూటీ
పెళ్లిసందD సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. రాఘవేంద్ర రావు నుండి ప్రశంసలు దక్కించుకున్న ఈ అమ్మడు అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించింది. ఆ సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయినా కూడా శ్రీలీలకు మంచి ఇమేజ్ బిల్డ్ అయ్యింది. దర్శకేంద్రుడు పరిచయం చేయడం వల్ల ఆమె కు లక్ కలిసి వచ్చింది. మొదటి సినిమా ప్లాప్ అయినా కూడా వరుసగా ఆఫర్లు దక్కుతున్నాయి.
ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ సక్సెస్ లేకున్నా కూడా ఈమె అయిదు ఆరు సినిమా లను సైన్ చేసి బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. ఈ అమ్మడు సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు.. కొత్త హీరోలు అనే తేడా లేకుండా అన్ని తరహా పాత్రల్లో అందరితో కలిసి నటించేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంది. ఈ సమయంలో ఈమె పారితోషికం గురించి ఆసక్తికర చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.
ఈ అమ్మడు ఒక్కో సినిమా కు కోటి రూపాయల వరకు పారితోషికంను డిమాండ్ చేస్తుందట. కొత్త హీరోలు అయితే అంతకు మించి అన్నట్లుగా ఈమె డిమాండ్ ఉంటుందట. ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకున్నా కూడా ఈమె కు ఈ స్థాయి పారితోషికం ఇచ్చేందుకు ఫిల్మ్ మేకర్స్ సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే కమిట్ అయిన రెండు మూడు సినిమాలు మినహా త్వరలో ప్రారంభం కాబోతున్న అన్ని సినిమాలకు కూడా ఈమె కోటి అంతకు మించి పారితోషికం అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మొదటి సినిమా తెలుగు లో చేసిన తర్వాత పెద్దగా ఈమెకు ఆఫర్లు రాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. సాదారణంగా తెలుగు ఫిల్మ్ మేకర్స్ సెంటిమెంట్ ను నమ్ముతారు. ప్లాప్ హీరోయిన్ ను పక్కకు పెట్టి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కాని శ్రీలీల విషయంలో అలా జరగడం లేదు. సక్సెస్ తో సంబంధం లేకుండా ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.
ఇప్పటికే రవితేజ సినిమా ధమాకా లో నటిస్తున్న ఈమె నవీన్ పొలిశెట్టి కి జోడీగా కూడా నటిస్తుంది. ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడి జోరు కొనసాగుతూనే ఉంది. తెలుగు మరియు ఇతర భాషల్లో వరుసగా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో తన పారితోషికం ను కోటికి పైగానే డిమాండ్ చేస్తున్నా కూడా ఈమె ను బుక్ చేసేందుకు నిర్మాతలు అడ్వాన్స్ లతో ఆమె ముందు నిల్చుంటున్నారు.