#DRUGS హీరోయిన్ సంజ‌న అసిస్టెంట్ ఇచ్చిన లీకుల క‌ల‌క‌లం

Update: 2020-09-05 05:00 GMT
డ్ర‌గ్స్ రాకెట్ వివాదం క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌నా‌లు పుట్టిస్తోంది. ఈ వివాదంలో తాజాగా న‌టి రాగిని దివ్వేదిని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో క‌న్న‌డ నాట క‌ల‌క‌లంగా మారింది. ఈ వ్య‌వ‌హారంలో మ‌రో క‌న్న‌డ న‌టి.. ప్ర‌భాస్ హీరోయిన్ సంజ‌న గ‌ల్రానీ అసిస్టెంట్ రాహుల్ ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ఆమెపై కూడా నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. దీంతో డ్ర‌గ్స్ ఆరోప‌ణ‌ల‌పై సంజ‌న ఘాటుగా స్పందించింది. ఈ విష‌యంలో మీడియా త‌న‌ని విసిగించ‌డం ఆగ్ర‌హాన్ని తెప్పించింద‌ని కామెంట్ చేసింది.

మీడియా అంటే త‌న‌కు గౌర‌వం వుంద‌ని అందులో కొంత మంది మంచి మిత్రులు కూడా వున్నార‌ని వెల్ల‌డించింది. డ్ర‌గ్స్ వివాదం పై త‌న‌ని మీడియా వ‌ర్గాలు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేద‌ని చిరాకు పుట్టే స్థాయిలో త‌న‌కు ఫోన్ ‌లు చేసి వేధిస్తున్నార‌ని మండిప‌డింది. రాజ‌కీయ నాయ‌కుల‌కు బ్రోక‌ర్ ‌గా మారిన ప్ర‌శాంత్ సంబ‌ర్గీ గురించి అడిగితే త‌న‌కేం తెలుస‌ని వాపోయింది.

ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ భాష‌ల్లో 50కి మించి చిత్రాల్లో న‌టించాన‌ని.. ప్ర‌భాస్‌- మోహ‌న్‌లాల్‌- మ‌మ్ముట్టి వంటి ప్ర‌ముఖ హీరోల‌తో క‌లిసి న‌టించిన త‌న‌కు డ్ర‌గ్స్ రాకెట్‌తో లింకులు అంట‌గ‌ట్ట‌డం దారుణంగా వుంద‌ని ఫైర‌వుతోంది. ప‌రిశ్ర‌మ‌లో ఏదైనా వివాదం జ‌రిగితే హీరోయిన్ లని అడ్డంగా బుక్ చేయ‌డం.. వారినే బ‌లిప‌శువుల‌ని చేయ‌డం ఆ మ‌ధ్య ఫ్యాష‌న్ అయిపోయింద‌ని ఈ బెంగ‌ళూరు హాట్ బేబీ ఘాటుగా స్పందించింది.
Tags:    

Similar News