సమంతకు ఏది ప్లస్సో అదే మైనస్ అయ్యింది..!
ఏమాయ చేసావే సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన శాకుంతలం వరకు ప్రేక్షకులను అలరించడానికి సమంత ఎలాంటి ప్రయోగాలకైన సరే అంటుంది. లైఫ్ లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని ధైర్యంగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో ఫాం లోకి వచ్చింది సమంత. ఇక రీసెంట్ రిలీజ్ శాకుంతలం చూసిన వారు డైరెక్ట్ గానే ఆ పాత్రకు సమంత సూట్ అవలేదని చెప్పేస్తున్నారు.
ముఖ్యంగా సమంతకు ఇన్నాళ్లు ఏదైతే ప్లస్ అయ్యిందని అనుకున్నామో అదే శాకుంతలం సినిమాకు మైనస్ అయ్యిందని అనిపిస్తుంది. సమంత మొదటి సినిమా నుంచి నిన్న మొన్నటి వరకు సింగర్ చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెప్పేది. ఇప్పుడు హీరోయిన్స్ అంతా కూడా ఎవరికి వారు సొంత డబ్బింగ్ చెబుతున్నారు కాబట్టి సమంత కూడా అలాంటి ప్రయత్నమే చేసింది. యశోద సినిమాకు కూడా సమంత సొంత వాయిస్ ఇచ్చింది. అది వేరే జోనర్ సినిమా కాబట్టి వర్క్ అవుట్ అయ్యింది. కానీ శాకుంతలం సినిమా విషయంలో సమంత డబ్బింగ్ తేడా కొట్టేసింది.
శాకుంతలం సినిమాలో సమంత సొంత డబ్బింగ్ చెప్పగా అది అంత ఇంప్యాక్ట్ కలగచేయలేదని తెలుస్తుంది. కొన్ని డైలాగ్స్ ఎంతో డెప్త్ ఉన్నాయని అనిపించినా సమంత చెప్పడంతో అవి చాలా పేలవంగా మారాయి. సమంత కాకుండా ఈ సినిమాకు తన డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చేత చెప్పించి ఉంటే కొంతవరకు బాగుండేదని అంటున్నారు. అంతేకాదు శాకుంతలం సినిమాలో సమంత జస్ట్ ఓకే అనేస్తున్నారు.
ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ఎవరైనా ఉంటే బాగుండేదని కూడా చెప్పుకుంటున్నారు. సోలోగా ఇలాంటి భారీ సినిమాను మోసేంత కెపాసిటీ సమంతకు రాలేదని అంటున్నారు. ఏది ఏమైనా శాకుంతలం రిజల్ట్ సమంతకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.