పిక్‌ టాక్‌ : తగ్గనంటూనే బాగా తగ్గిందిగా

Update: 2019-01-28 14:03 GMT
తెలుగు ప్రేక్షకులకు 'అలా మొదలైంది' అంటూ పరిచయం అయిన ముద్దుగుమ్మ నిత్యామీనన్‌ మల్టీ ట్యాలెంట్‌ తో అందరి దృష్టిని ఆకర్షించింది. నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే చేయడంతో పాటు, గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటానంటూ గిరి గీసుకుని ఉండటంతో నిత్యా మీనన్‌ కు అవకాశాలు తగ్గాయి. ఈమద్య కాలంలో ఆమె చాలా తక్కువగా నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళంలో అడపా దడపా చిత్రాలు చేస్తున్న నిత్యామీనన్‌ ఆమద్య బాగా లావు అయ్యింది. ఒక ఇంటర్వ్యూలో మీరు బాగా లావు అవుతున్నారు కదా, కాస్త తగ్గితే బాగుంటుందని ఒక జర్నలిస్ట్‌ ప్రశ్నించగా అతడిపై చాలా సీరియస్‌ అయ్యింది. నేను లావు ఉంటే నీకు వచ్చిన సమస్య ఏంటీ, నాకు లావు ఉండటం వల్ల అవకాశాలు రావడం లేదని మీరు ఎలా అంటారంటూ సీరియస్‌ అయ్యింది.

కట్‌ చేస్తే నిత్యామీనన్‌ ఇప్పుడు గతంతో పోల్చితే చాలా సన్నబడి కనిపిస్తోంది. తాజాగా ఈమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌ అయ్యింది. హైవే పక్కన షూట్‌, ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌ వివరాలను త్వరలో వెళ్లడిస్తానంటూ నిత్యామీనన్‌ పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో నిత్యామీనన్‌ సన్నగా కనిపించడంతో పాటు, ఫిట్‌ బాడీతో స్టైలిష్‌ గా కనిపిస్తోంది. ఇటీవల తమిళంలో అమ్మ జయలలిత బయోపిక్‌ లో నటించిన నిత్యామీనన్‌ ఆ పాత్రకు తగ్గట్లుగా లావు అయ్యింది. కొత్త సినిమా కోసం ఈమె ఇలా బక్కగా అయినట్లుగా అనిపిస్తోంది.
Tags:    

Similar News