ఒకరిపై ఒకరు కాలెత్తిన స్టార్ హీరోయిన్లు!

Update: 2018-11-02 13:38 GMT
సహజంగా ఇద్దరు హీరోయిన్లు ఫ్రెండ్స్ గా ఉండరని.. వాళ్ళమధ్యలో ఎప్పుడూ ఏవో గొడవలు వస్తుంటాయని అంటూ ఉంటారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్.. పూజా హెగ్డేలు మాత్రం అలాంటి అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచి పెట్టేస్తున్నారు.  రీసెంట్ గా వారు ముంబై లోని ఒక ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ హారిసన్ జేమ్స్ కు సంబంధించిన జిమ్ లో చేసిన విన్యాసాలు చూస్తే మీకే అర్థం అవుతుంది.

MFT ఫిట్ నెస్ స్టూడియో ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియో ను షేర్ చేశారు. హీరోయిన్లు ఇద్దరూ జిమ్ లో టఫ్ గా ఉండే స్త్రెంగ్థ్ ఎక్సర్ సైజులు చేస్తున్నారు. ఒకరు హాఫ్ సిట్టింగ్ పొజిషన్ లో గుంజీలు తీస్తునట్టు కూర్చుంటే మరొకరు ఒక కాలిని పై లేపి ఆమె తలపై నుండి కుడి నుండి ఎడమకు తిప్పాలి.. ఆ తర్వాత మరో కాలితో అలాగే చెయ్యాలి.. ఆ తర్వాత జంప్ చేసి రివర్స్ డైరెక్షన్ లో కూర్చోవాలి.   ఇప్పుడు సేమ్ ఎక్సర్ సైజ్ మరో హీరోయిన్ చేయాల్సి ఉంటుంది.  వీళ్ళిద్దరికి హారిసన్ జేమ్స్ సూచనలు ఇస్తూ కమాన్ గర్ల్స్.. యూ కెన్ డూ ఇట్ అంటున్నాడు.

ఇదిలా ఉంటే ఇద్దరూ హీరోయిన్లు తమ కెరీర్లో రివ్వున దూసుకుపోతున్నారు.  పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు 'మహర్షి' తో పాటుగా ప్రభాస్ - రాధాకృష్ణ కుమార్ చిత్రాలలో నటిస్తోంది. మరోవైపు రకుల్ జోరు తెలుగులో కాస్త తగ్గినా తమిళ లో సూర్య 'ఎన్‌ జికె'.. కార్తీ కొత్త చిత్రం 'దేవ్'.. శివకార్తికేయన్ తో మరో చిత్రం లో నటిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View




Tags:    

Similar News