`రాధేశ్యామ్` పోస్టర్: ప్రేరణకు అందుకే పడిపోయాడా?
అందమైన నవ్వు.. అమాయకమైన చూపు.. ఆకర్షణీయమైన కళ్లు.. తీరైన ముకుతీరు.. తాను ఉంటే చాలు ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇవన్నీ ఉంటే ఆ అమ్మాయికి పడిపోకుండా ఏ కుర్రాడైనా ఆగుతాడా? అందుకేగా శ్యాం `ప్రేరణ`కి పడిపోయాడు. ఇంతకీ శ్యాం ఎవరో ప్రత్యేకించి చెప్పాలా? మన డార్లింగ్ ప్రభాస్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్ టాలీవుడ్. ప్రస్తుతం `రాధేశ్యామ్` పెండింగ్ చిత్రీకరణను పూర్తి చేసేందుకు ప్రభాస్ తపిస్తున్నాడు. ప్రభాస్- పూజా హెగ్డే జంట రొమాన్స్ లవ్ స్టోరి ఆద్యంతం రక్తి కట్టిస్తుందని సమాచారం. ఈ చిత్రానికి జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్ - గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
నేటి(అక్టోబర్ 13)తో టాలీవుడ్ డ్రీమ్ గర్ల్ పూజా హెగ్డేకు 30 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా రాధేశ్యామ్ నుంచి పూజా లుక్ ని లాంచ్ చేసింది చిత్రబృందం. హ్యాపీ బర్త్ డే ప్రేరణ అంటూ అదిరిపోయే గిఫ్ట్ నే ఇచ్చారు. ఇక ప్రేరణ యూరప్ దేశంలో ఠీవిగా కాఫీ షాప్ లో 23 వ నంబర్ బెంచీ మీద కూచుని ప్రియుడితో ఎంచక్కా మాట్లాడుతోంది. గుసగుసగా నవ్వులు చిందిస్తోంది. డార్లింగ్ ఏదో ఎగ్జయిట్ చేసే రొమాంటిక్ మ్యాటరే చెప్పినట్టు కనిపిస్తోంది. ఇక ప్రేరణకు గిఫ్ట్ కాబట్టి ప్రభాస్ ని హైడ్ చేస్తూ వెనక వైపు నుంచి స్టిల్ ని ఎలివేట్ చేశారు. ఇంతకీ ప్రేరణతో ఏం గుసగుసలాడుతున్నావ్ డార్లింగ్?
ఇక పూజా హెగ్డే కెరీర్ జర్నీ సంగతి చూస్తే... 2012 లో మిస్కిన్ యొక్క తమిళ సూపర్ హీరో చిత్రం `ముగమూడి`తో తొలి అడుగులు వేసింది. మిస్ ఇండియా యూనివర్స్ 2010 లో రెండవ రన్నరప్ అయిన పూజా దృష్టి పూర్తిగా సినిమాలపైనే. ప్రత్యేకించి 2016 లో హృతిక్ రోషన్ తో కలిసి మోహెంజో దారోలో నటించినప్పుడు ఎంతో ఎగ్జయిట్ అయ్యింది. 2014 లో ఓక లైలా కోసం .. ముకుందా చిత్రాలతో తెలుగులో అడుగుపెట్టింది. నాటి నుండి ఆమె టాలీవుడ్ ప్రేక్షకుల మనసును గెలుచుకుని ఇక్కడే స్థిరపడిపోయింది. ఆమె కాళ్ళు ఎంతందంగా ఉంటాయో అల వైకుంఠపురములో మాంత్రికుడు చెప్పిన తీరు తెలిసినదే. 2020 ఈ బుట్టబొమ్మకు మాత్రం అద్భుతంగా కలిసొచ్చింది. అల రూపంలో బంపర్ హిట్ కొట్టి ఇప్పుడు అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తోంది. వేరే సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉంది. రాధేశ్యామ్ పై పూజా భారీ అంచనాలే పెట్టుకుంది. పాన్ ఇండియా నాయికగా తన పేరు మార్మోగుతుందని భావిస్తోంది.