• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాపం .. నిత్యా మీనన్ ను...

పాపం .. నిత్యా మీనన్ ను ఆరేళ్లు వేధించాడట!

By - Tupaki Desk
Update: 2022-08-07 07:16 GMT
వెండితెరపై కథానాయికగా నిలదొక్కుకోవాలంటే .. స్టార్ డమ్ ను సంపాదించాలంటే స్కిన్ షో చేయవలసిందే అనే  అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాంటి అభిప్రాయం కరెక్టు కాదని నిరూపించిన అతికొద్ది మంది కథానాయికలలో నిత్యామీనన్ ఒకరు. స్కిన్ షో అనే మాటకి చాలా దూరంగా ఉంటూనే ఆమె తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. మలయాళ సినిమా ద్వారా నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నిత్యామీనన్, ఆ తరువాత కన్నడ .. తెలుగు .. తమిళ భాషల్లో అడుగుపెట్టింది.

చూడటానికి నిత్యా మీనన్ ముద్దుగా .. ముద్దమందారం మాదిరిగా ఉంటుంది. విశాలమైన కళ్లతో అద్భుతమైన హావభావాలను పలికిస్తుంది. 'అలా మొదలైంది'  సినిమాతో తెలుగు తెరకి ఆమె పరిచయమైంది. ఈ పుష్కర కాలంలో  'ఇష్క్' .. 'గుండెజారి గల్లంతయ్యిందే' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'జనతా గ్యారేజ్' వంటి హిట్స్ ఆమె ఖాతాలో కనిపిస్తాయి. నటన ప్రధానమైన పాత్రలలో .. నాయిక ప్రధానమైన కథలలో తనకి సాటిలేదని నిత్యామీనన్ నిరూపించుకుంది. అన్ని ప్రాంతాలలో కూడా తన అభిమానుల సంఖ్యను పెంచుకుంది.

కథానాయికలను చాలామంది అభిమానిస్తుంటారు .. ఆరాధిస్తుంటారు. ఆ అభిమానం వెర్రితలలు వేసిన కొంతమంది కారణంగా కొంతమంది కథానాయికలు ఇబ్బందిపడిన సందర్భాలు ఉన్నాయి. అలా తాను కూడా చాలా ఇబ్బందిపడినట్టుగా నిత్యామీనన్ చెబుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " సంతోష్ వర్గీ అనే ఒక వ్యక్తి  నన్ను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రచారం చేశాడు. అతను అలా ప్రచారం చేయడం నన్ను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసింది. ఆరేళ్లుగా అతని  వేధింపులు కొనసాగుతూ వచ్చాయి. ఈ విషయంలో విసిగిపోయిన మా పేరెంట్స్ కూడా అతనిని హెచ్చరించారు.  

సంతోష్ వర్గీ తన ధోరణి మార్చుకోకపోవడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని చాలామంది చెప్పారు. కానీ నేనే అతనిని క్షమించి వదిలేశాను. తన గురించి సంతోష్ చెప్పేవన్నీ అబద్దలనీ  .. ఇకపై అతను ఏం చెప్పినా ఎవరూ నమ్మొద్దని అంది.  ప్రస్తుతం నిత్యామీనన్ నుంచి రావడానికి 'చిత్రామ్బలం' అనే తమిళ సినిమా రెడీ అవుతోంది. ధనుశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    
  • Actress Nithya Menon 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS