NTR నే డీగ్రేడ్ చేస్తూ స్టార్ డైరెక్ట‌ర్ అలా అన్నారా?

Update: 2020-11-05 12:30 GMT
బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్ తో క‌థానాయిక‌ పాయ‌ల్ ఘోష్ వైరం గురించి తెలిసిందే. అనురాగ్ పై పాయ‌ల్ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేయ‌డంతో దీనిపై కోర్టుల ప‌రిధిలో విచార‌ణ సాగుతోంది. ఈ వివాదంలో కేసులు స‌బ్ కేసుల గురించి ఇటీవ‌ల మీడియా వేదిక‌గా గ‌లాటా గురించి తెలిసిందే.

తాజాగా పాయ‌ల్ ఘోష్ మేనేజ‌ర్ .. అనురాగ్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ ఈ గొడ‌వ‌లోకి టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పేరును ప్ర‌స్థావించ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. చివ‌రిలో ఆయ‌న ప‌క్కా జంటిల్మ‌న్ అని చెప్పినా కానీ అన‌వ‌స‌రంగా ఈ  వివాదంలోకి లాగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

2013-14లో నాటి అనుభ‌వ‌మ‌ది. అప్ప‌ట్లో ఓ సమావేశంలో జూనియర్ ఎన్.టి.ఆర్ తో ఊసరవెల్లి (2011) అనే సినిమా చేస్తున్నాన‌ని.. తన సినిమాను నిర్మాత అనురాగ్ వ‌ద్ద‌ ప్రస్తావించమని పాయ‌ల్ త‌న మేనేజ‌ర్ ని కోరార‌ట‌. అయితే జూనియ‌ర్ తో శారీరక సంబంధాలు అంట‌గ‌ట్టాడ‌ని ఘోష్ మేనేజ‌ర్ చెప్పార‌ట‌. అనురాగ్ తో సంభాష‌ణ‌ల‌కు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ని ఆయ‌న షేర్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

నిజానికి తార‌క్ ఆమెను ఏనాడూ అలాంటి దృష్టితో చూడ‌లేద‌ని కానీ అనురాగ్ వినాశ‌క‌ర బుద్ధికి ఇది సాక్ష్యం అని చెప్పారు పాయ‌ల్ ఘోష్ మేనేజ‌ర్ కం ఫ్రెండు. తన సహనటుడితో తన రిలేష‌న్ ని ‘అపకీర్తి’ పాల్జేశార‌ని ఘోష్ ఈ సంద‌ర్భంగా ఆరోపించారు.

అనురాగ్ కశ్యప్ ‌కు పాయ‌ల్ చేసిన సినిమాల‌ గురించి చెప్పేందుకు తన స్నేహితుడు మేనేజర్ ఊస‌ర‌వెల్లి చిత్రాన్ని సూచించారట‌. కానీ అట్నుంచి ఊహించనిది ఎదురైంద‌ని చెప్పారు.

“జూనియర్ ఎన్.‌టిఆర్ నాతో ఎప్పుడూ త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించ‌లేదని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. అతను మంచివాడు” అని పాయ‌ల్ వ్యాఖ్యానించింది. సందేశం తొలగించిన ట్వీట్ ను పంచుకున్న పాయల్, ఈ సమావేశం హసీ తో ఫేసీ చిత్రం తారాగణం ఎంపిక‌ల స‌మ‌యంలో జ‌రిగింద‌ని తెలిపారు.  ఇది ఘోరమైన సంఘటనగా అభివ‌ర్ణించారు .

క‌శ్య‌ప్ త‌ప్పుగా ఆరోపించార‌ని.. తాను ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తున్నానని పాయ‌ల్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ.. హోంమంత్రి కార్యాలయం ... ఎన్ ‌సిడబ్ల్యు చీఫ్ రేఖ శర్మలను ట్యాగ్ చేయ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక అనురాగ్ వేధింపుల వ్య‌వ‌హారంలో మ‌రో ఇద్ద‌రు క‌థానాయిక‌ల పేర్లు వినిపించి ఆ త‌ర్వాత కోర్టు మొట్టికాయ‌ల‌తో పాయ‌ల్ సారీ చెప్పిన సంగ‌తి విధిత‌మే.

5 సంవత్సరాల క్రితం కశ్యప్ తనపై బలవంతం చేశాడని ఆరోపిస్తూ పాయల్ సెప్టెంబర్ 19 న ట్విట్టర్ ‌లో సందేశం వ‌దిలాక ఇన్ని ఎపిసోడ్స్ సాగాయి.  ముంబైలోని వెర్సోవా పోలీసులను సంప్రదించి అత్యాచారం ఆరోపణలపై చిత్రనిర్మాతపై పాయ‌ల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరి సెలబ్రిటీల వాంగ్మూలం నమోదు అయినప్పటికీ తాజా అప్ డేట్ ఏంటో తెలియ‌లేదు. ఇటీవ‌ల‌ పాయల్ ఘోష్ రామ్ ‌దాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన సంగ‌తి తెలిసిన‌దే. పార్టీలో మహిళా విభాగానికి ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు.
Tags:    

Similar News