కష్టం అయినా ఖరీదైనా ఆమెనే ఫిక్స్ చేసిన తేజ
దర్శకుడు తేజ కొన్ని నెలల క్రితం రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెల్సిందే. అందులో ఒకటి అలిమేలు మంగ వెంకటరమణ. గోపీచంద్ హీరోగా ఈ సినిమా ఉంటుందని మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. టైటిల్ చూస్తుంటే హీరోయిన్ ది కూడా ఖచ్చితంగా చాలా పవర్ ఫుల్ పాత్ర అయ్యి ఉంటుందని అందుకోసం స్టార్ హీరోయిన్ ను నటింపజేసే అవకాశం ఉందని అంతా భావించారు.
అనుకున్నట్లుగానే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మహానటి సినిమా తర్వాత జాతీయ స్థాయి నటిగా గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్ ఈ చిన్న సినిమాలో నటిస్తుందా అంటే అనుమానమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలిమేలు మంగ వెంకటరమణ సినిమాలో మొదటి నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించబోతున్నట్లుగా దర్శకుడు తేజ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఇప్పటికే కీర్తి సురేష్ ను తన కథతో ఒప్పించారట. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో పాటు ఆమె డిమాండ్ చేసిన పారితోషికంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల సినిమాలో ఆమె నటించేందుకు సిద్దం అయ్యిందట.
హీరో గోపీచంద్ కు దాదాపుగా సమానమైన పారితోషికంను కీర్తి సురేష్ కు దర్శకుడు తేజ ఇచ్చేందుకు రెడీ అయ్యాడంటూ మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఎప్పుడు ప్రయత్నించే కీర్తి సురేష్ ఈ ఛాలెంజ్ ను స్వీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా దర్శకుడు తేజ ప్లాన్ చేస్తున్నాడు.