విషాదం.. జాన్ కొట్టాలి ఇక లేరు

Update: 2020-01-29 04:28 GMT
తెలుగు సినిమాల్ని రెగ్యులర్ గా చూసే వాళ్లలో ఎవరినైనా సరే..జాన్ కొట్టాలి గురించి అడగండి. వెనువెంటనే తెల్ల ముఖం వేస్తారు. అదే సమయంలో.. ఆయన ఫోటో చూపిస్తే.. అరే.. ఆయనా? ఎందుకు తెలీదని చెబుతారు. తెలుగు సినిమాలలో తనదైన ముద్ర వేసిన నటుల్లో జాన్ కొట్టాలి ఒకరు. నటుడిగా ఆయనకు గ్లామర్.. గ్రామర్ రెండూ ఉన్నా.. ఆయన ఫేస్ పాపులర్ కానీ పేరు అంత పాపులర్ కాదు. మంచి నటుడిగా.. రచయిగా పేరున్న ఆయన మంగళవారం కన్నుమూశారు.

చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల మదిలో ఆయన నిలిచిపోయేలా ఆయన నటన ఉంటుంది. రెగ్యులర్ నటులకు కాస్త భిన్నంగా ఉండే ఆయన్ను సినిమా ఇండస్ట్రీలో పలువురు అగ్ర కథానాయకులు ప్రత్యేకంగా అభిమానిస్తారు. నాటక రంగం నుంచి ఆయన పలు వెబ్ సిరీస్ లతో పాటు.. షార్ట్ ఫిలింస్ లోనూ నటించారు.

కేరళ నేపథ్యం ఉన్న ఆయన హైదరాబాద్ లోని ప్రగతినగర్ లో నివసిస్తుంటారు. నటుడిగా.. రచయితగా.. దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో సుపరిచితుడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన టాలెంట్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. మను.. ఫలక్ నుమా దాస్.. సమ్మోహనం.. రక్తం లాంటి పలుచిత్రాల్లో ఆయన నటించారు. మను చిత్రంలో ఆయన నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు పొందారు.

జాన్ కొట్టాలి మరణవార్తను దర్శకుడు సాయి రాజేశ్ ట్విట్టర్ తో తెలియజేశారు. చిన్న వయసులోనే గుండెపోటుతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. జాన్ ఆకస్మిక మరణం  దురదృష్టకరమని హీరో సుధీర్ బాబు పేర్కొన్నారు. ఆయన నటన తనకెంతో ఇష్టమని ఆయన చెప్పారు. జాన్ మరణవార్త సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురిని షాక్ కు గురి చేస్తోంది. జాన్ మరణంతో టాలీవుడ్ మంచి నటుడ్ని కోల్పోయిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News