అజయ్ కి హలో చెప్పండి

Update: 2017-11-24 14:11 GMT
అక్కినేని అఖిల్ రెండో సినిమా సందడి ఇప్పటికే మొదలైపోయిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 22న అఖిల్ సెకండ్ మూవీ హలో రిలీజ్ కానుండగా.. ఆల్రెడీ మూవీ ప్రమోషన్స్ అధికారికంగా స్టార్ట్ చేసేశారు.

చిన్నపాటి టీజర్ తో ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్రారంభించగా.. ఇప్పుడు సినిమాలోని కీలక పాత్రలను పరిచయం చేస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రోల్ పేరు రిషి కాగా.. ఇప్పుడు ఈ రోల్ కు సంబంధించిన లుక్ ని రివీల్ చేశారు. రిషికి హలో చెప్పండి అంటూ అజయ్ లుక్ ని విడుదల చేయగా.. గెటప్ నుంచి స్టైలింగ్ వరకూ అదరగొట్టేస్తున్నాడు అజయ్. తన ప్రతీ చిత్రంలోనూ అజయ్ కు అత్యంత ప్రాధాన్యత ఉండే పాత్రను ఇచ్చే విక్రమ్ కె కుమార్.. హలో చిత్రంలో కూడా ఇదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేశాడు.

హలో చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషన్ మెటిరియల్.. మూవీకి విపరీతమైన హైప్ తీసుకొస్తోంది. ఇప్పుడీ క్రేజ్ ను మరింతగా పెరిగేలా చేయడంలో యూనిట్ బాగానే సక్సెస్ అవుతోంది.
Tags:    

Similar News