సూపర్ స్టార్ షాకింగ్‌ నిర్ణయం.. సినిమాలకు గుడ్‌ బై

Update: 2022-03-27 15:30 GMT
మిస్టర్ పర్ఫెక్ట్‌ గా పేరు దక్కించుకుని బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ గా ఇండియాస్ బిగ్గెస్ట్‌ స్టార్స్ లో ఒక్కడిగా నిలిచిన అమీర్ ఖాన్ తన సినీ ప్రస్థానంకు గుడ్‌ బై చెప్పబోతున్నాడా అంటే ఔను అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఆయన నటించిన లాల్‌ సింగ్‌ చద్దా సినిమా ఆయన చివరి సినిమా అయ్యే అవకాశాలు ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. పూర్తి స్థాయిలో నిర్ణయాన్ని తీసుకోలేదు కాని ఖచ్చితంగా ఆయన సినిమాలకు గుడ్‌ బై చెప్పేందుకు సిద్దం అయ్యాడని తెలుస్తోంది.

తాజాగా ఆయన లాల్‌ సింగ్‌ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ.. చాలా కాలంగా నా పిల్లలకు ఏం కావాలో నాకు తెలియదు. వారికి ఏం కావాలి.. నా నుండి వారు ఏం ఆశిస్తున్నారు అనే విషయం తెలుసుకునేప్పటికి ఆలస్యం అయ్యింది. దాంతో నా పై నాకు చాలా కోపం వచ్చింది... నాకు పిల్లలను దూరం చేసిన సినిమాలపై కోపం వచ్చింది. నాకు నా కుటుంబానికి గ్యాప్ పెంచింది సినిమాలు కనుక ఆ సినిమాలకు గుడ్‌ బై చెప్పాలనుకున్నాను.

నేను సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని చాలా నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నాను. కాని ఆ సమయంలో ప్రకటిస్తే లాల్‌ సింగ్‌ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అలా చెప్పానేమో అని అంతా భావిస్తారు. అందుకే నేను ఆ సమయంలో చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు ఈయన ఆ విషయాన్ని చెబుతున్నాడు అనేది ఏ ఒక్కరికి అర్థం కావడం లేదు.

లాల్‌ సింగ్‌ చద్దా సినిమా ఇంకా విడుదల అవ్వకుండానే ఎందుకు తన సినిమాల రిటైర్మెంట్‌ విషయాన్ని ప్రకటించారు అనేది తెలియాల్సి ఉంది. హీరోగా నటించడం మాత్రమే కాకుండా నిర్మాణంకు మరియు డైరెక్షన్‌ కు కూడా గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. అమీర్‌ ఖాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

తన ఒక్కో సినిమాకు మూడు నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. కనుక ఒక సినిమా విడుదల అయిన తర్వాత ప్రకటిస్తే ఆ ప్రభావం ఎవరి పై ఉండదు అని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తన నిర్ణయాన్ని పిల్లలకు మరియు మాజీ భార్య కిరణ్ రావుకు చెప్పిన సమయంలో వారు అంగీకరించలేదు. నేను తప్పు చేస్తున్నట్లుగా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కిరణ్ రావు నా నిర్ణయం చెప్పిన సమయంలో కన్నీళ్లు పెట్టుకుంది అంటూ అమీర్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News