టాలెంటెడ్ హీరో మరో భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాడా..?
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు క్రేజీ యాక్టర్ గా నిర్మాతల హీరోగా మారిపోయాడు. వైవిధ్యమైన చిత్రాలతో విలక్షమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ 'మక్కల్ సెల్వన్' అనిపించుకున్నాడు. ఇక చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అలానే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 'పిజ్జా' 'పేట' వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలతో అలరించాడు.
నిజానికి అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప' సినిమాలో ముందుగా విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాల్సి ఉంది. అయితే డేట్స్ అడ్జస్ట్ కాలేదని ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో విజయ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బుప్పా అనే పాత్ర కోసం బరువు తగ్గాల్సి ఉండగా.. విజయ్ సేతుపతి మాత్రం అలానే బరువు మెయింటైన్ చేస్తున్నాడు. దీంతో ఆ పాత్రపై అతను ఆసక్తి కనబరచడం లేదని మరో యాక్టర్ ని సంప్రదిస్తున్నారని అంటున్నారు. ఇటీవల ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' న7నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే.