• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సల్మాన్‌ ను చూసి అమీర్...

సల్మాన్‌ ను చూసి అమీర్ భయపడుతున్నాడా..

By - Tupaki Desk
Update: 2016-06-07 07:36 GMT
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా బాలీవుడ్‌ ను ఏలుతోంది ఖాన్ త్రయం. వీరిలో ఒకప్పుడు షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. తర్వాతి స్థానంలో సల్మాన్ ఖాన్ ఉండేవాడు. అమీర్ ఖాన్ ది మూడో స్థానం. ఐతే తర్వాతి కాలంలో నెంబర్లు మారాయి. లగాన్.. రంగ్ దె బసంతి లాంటి సినిమాలతో అమీర్ నెమ్మదిగా తన ఇమేజ్ పెంచుకుని రెండో స్థానానికి వస్తే.. వరుసగా చెత్త సినిమాలు చేసిన సల్మాన్ ఖాన్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇంకొన్నేళ్లు గడిచాక అమీర్ ఖాన్ ఏకంగా అగ్రస్థానానికి దూసుకెళ్లిపోయాడు. ‘వాంటెడ్’ దగ్గర్నుంచి పుంజుకున్న సల్మాన్.. వరుస హిట్లతో షారుఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో స్థిరపడ్డాడు. ఇప్పుడు బాలీవుడ్లో నిస్సందేహంగా అమీరే నెంబర్ వన్. అతడి సినిమాల్ని చూసి వేరే వాళ్లు భయపడాల్సిందే కానీ.. అతను వేరే సినిమాల్ని చూసి కంగారు పడే పరిస్థితి లేదు.

ఐతే తన కొత్త సినిమా ‘దంగల్’ విషయంలో మాత్రం అమీర్ కు కంగారు పట్టుకుందని.. అందుకు సల్మాన్ సినిమా ‘సుల్తాన్’ కారణమని అంటున్నారు. విశేషం ఏంటంటే.. ఈ ఖాన్ లు ఇద్దరూ ఒకే ఏడాది రెజ్లింగ్ నేపథ్యంలోనే సినిమాలు చేయడానికి తయారయ్యారు. ఐతే అమీర్ ఎప్పుడూ కంటెంట్ పరంగా హైలో ఉంటాడు కాబట్టి ముందు ‘దంగల్’ మీదే అందరి దృష్టీ నిలిచింది. కానీ ‘సుల్తాన్’ టీజర్.. ట్రైలర్ రిలీజయ్యాక మాత్రం పరిస్థితి మారిపోయింది. ఇది విషయం ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది. ఐతే ఒకే క్రీడ నేపథ్యంలో రెండు సినిమాలు రావొద్దనేం లేదు కానీ.. ఈ రెండు సినిమాల స్టోరీ లైన్ కూడా ఒకేలా ఉంటుందేమో అన్న సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా రిలీజ్ కాబోతున్న ‘సుల్తాన్’ అంచనాలకు తగ్గట్లు పెద్ద హిట్టయితే ఈ ఏడాది ఆఖర్లో అనుకున్న ప్రకారం ‘దంగల్’ను రిలీజ్ చేయకూడదని భావిస్తున్నాడట అమీర్. ఈ ఏడాదే ఆ సినిమా కూడా రిలీజైతే కచ్చితంగా ‘సుల్తాన్’ ప్రభావం ఉంటుందని.. అందుకే వచ్చే ఏడాది మధ్యలో రిలీజ్ చేద్దామని యోచిస్తున్నాడట. ఐతే ముందు ‘సుల్తాన్’ రిజల్ట్ ఏంటన్నది తేలాల్సి ఉంది.
Tags:    
  • Aamir Khan 
  • Salman Khan 
  • Sultan Movie 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS