అతడి పాత సినిమాలు చూడలేనన్న స్టార్ హీరో!
బాలీవుడ్ హీరోల్లోభిన్నమైన హీరోల్లో అమీర్ ఖాన్ పేరు ముందుంటుంది. వైవిధ్యమైన కథలతో ఆయన సినిమాలు ఉంటాయి. ఆయన నిర్మాతగా నిర్మించే సినిమాల్లోనూ డిఫరెంట్ లైన్ కనిపిస్తూ ఉంటుంది. ఆచితూచి అన్నట్లుగా ఆయన సినిమాల్ని ఎంచుకుంటూ ఉంటారు. ఒకదానితో మరొకటి సంబంధం లేని కథల్ని ఎంచుకునే అమీర్ కు మిస్టర్ పర్ ఫెక్ట్ అన్న పేరుంది.
అలాంటి ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన ముప్ఫై ఏళ్ల కెరీర్ లో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న అమీర్‌కు.. తన పాత చిత్రాలు అస్సలు నచ్చవట. తాను గతం గురించి పట్టించుకోనని.. తనకు ఈ రోజు ఏమిటన్నది మాత్రమే ముఖ్యమని తేల్చేశాడు. అప్పుడప్పుడు తన పాత ఫ్రెండ్స్ ను కలిసినప్పుడు తన పాత చిత్రాల ప్రస్తావన వస్తుందని.. కానీ తనకు అది అస్సలు నచ్చదన్నారు.
కెరీర్ మొదట్లో నటించిన సినిమాల్ని చూడటం తనకు అస్సలు నచ్చదన్నారు. అంతదాకా ఎందుకు ఏడాది క్రితం నటించిన చిత్రాన్ని చూసినా.. అందులో ఎన్నో తప్పులు కనిపిస్తాయని.. ఆ సీన్ లో అలా చేసి ఉండాల్సింది కాదన్న భావన కలుగుతుందన్నారు. తనను అందరూ మిస్టర్ పర్ ఫెక్ట్ అంటుంటారని.. కానీ సినిమాల విషయానికి వస్తే మాత్రం ఏదీ పర్ ఫెక్షన్ అన్నది ఉండదని.. సాధ్యమైనంతవరకూ పని చేయటం మాత్రమే ఉంటుందన్నారు.
ఇక.. తన సినిమాలు పక్కాగా సక్సెస్ కావటంపై పలువురు.. విజయానికి తన దగ్గర ఏదో కోడ్ ఉంటుందని అనుకుంటారని.. కానీ అలాంటిదేమీ ఉండదన్నారు. ఒకవేళ తనకు ఆ విషయమే తెలిస్తే.. ప్రతి సినిమాకు తొలి సినిమాకు కష్టపడినట్లుగా కష్టం చేయాల్సిన అవసరం ఉండదు కదా? అని ప్రశ్నించే అమీర్.. తన వద్దకు వచ్చే ప్రతి కథను ప్రేక్షకుడి దృష్టి కోణం నుంచి మాత్రమే చూస్తానని చెప్పారు. అదే.. తన ఫార్ములాగా చెప్పుకొచ్చారు.