• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సౌత్‌ మూవీకి అక్కడ...

సౌత్‌ మూవీకి అక్కడ సీక్వెల్‌ ఏంటి గురూ?

By - Tupaki Desk
Update: 2020-03-13 07:15 GMT
సూర్య హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో 2005వ సంవత్సరంలో వచ్చిన ‘గజినీ’ చిత్రం ఎంతటి సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గజినీ చిత్రాన్ని అదే టైటిల్‌ తో హిందీలో అమీర్‌ ఖాన్‌ హీరోగా 2008లో మురుగదాస్‌ రీమేక్‌ చేశాడు. హిందీలో మొదటి వంద కోట్ల సినిమాగా గజినీ నిలిచింది. సౌత్‌ రీమేక్‌ బాలీవుడ్‌ లో మొదటి వంద కోట్ల సినిమాగా నిలవడంతో గజినీ చాలా స్పెషల్‌ మూవీగా అంతా భావిస్తారు.

గజినీ చిత్రంకు సీక్వెల్‌ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్‌ గతంలో ఒక ఇంటర్వ్యూలో సీక్వెల్‌ విషయమై ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తాజాగా సీక్వెల్‌ గురించి మరో ఆసక్తికర అప్‌ డేట్‌ అందుతోంది. అమీర్‌ ఖాన్‌ సీక్వెల్‌ చేసేందుకు దర్శకుడు మురుగదాస్‌ కు ఓకే చెప్పినట్లు గా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ఈ సీక్వెల్‌ పట్టాలెక్కే అవకాశం ఉందని మురుగదాస్‌ సన్నిహితులు చెబుతున్నారు.

తమిళ ఆడియన్స్‌ మాత్రం గజినీ చిత్రానికి మొదట ఇక్కడ సీక్వెల్‌ చేయాలని ఆ తర్వాత బాలీవుడ్‌ లో రీమేక్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. సౌత్‌ లో హిట్‌ అయిన మూవీకి అక్కడ సీక్వెల్‌ ఎలా తీస్తారు.. మురుగదాస్‌ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ తమిళ తంబీలు కోరుతున్నారు. మరి మురుగదాస్‌ మాత్రం బాలీవుడ్‌ లోనే సీక్వెల్‌ కు ప్లాన్‌ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లో మురుగదాస్‌ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.
Tags:    
  • Aamir Khan May Return in Ghajini Sequel 
  • Ghajini Sequel 
  • Ar Murugadoss On Ghajini Sequel 
  • Bollywood 
  • Kollywood 
  • Bollywood News 
  • Kollywood News 
  • Aamir Khan 
  • Surya 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

రామాయణం బడ్జెట్‌లో 9 శాతంతో తెరకెక్కిన గాడ్జిల్లా మైనస్ జీరో దూకుడు!

2026-11-09 06:05 GMT

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS